అంబ‌రీష్ త‌న‌యుడితో కాంతార బ్యూటీ రొమాన్స్!

Update: 2022-11-20 04:30 GMT
'కాంతార' అనే చిన్న సినిమా హిట్ తో  పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిపోయింది స‌ప్త‌మి గౌడ‌. ఇందులో అమ్మ‌డు రోల్ చిన్న‌దే అయినా హిట్  ముందు అన్ని చిన్న‌బోయాయి. రిష‌బ్ శెట్టితో పాటు చిన్న చిన్న పాత్ర‌లు సైతం సినిమాలో హైలైట్ అయ్యాయి. నేచుర్ బ్యూటీ స‌ప్త‌మీ గౌడ్ కూడా అలాగే హైలైట్ అయింది. అంత‌కు ముందు కొన్ని సినిమాలు చేసినా వేటితోనూ రాని గుర్తింపు చిన్న పాత్ర‌తో ద‌క్కించుకుంది.

అటుపై సోష‌ల్ మీడియాలో కొత్త ఫోటోల‌తో వైర‌ల్ గామార‌డంతో బ్యూటీ మ‌రింత పాపుల‌ర్ అయింది. హిట్ తో ఇత‌ర భాష‌ల్లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తెలుగు మీడియం బ‌డ్జెట్ చిత్రాలు సైతం పిలిచి అవ‌కాశం ఇచ్చే స‌న్నివేశం క‌నిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ 90కాలం నాటి ఓ ప్రేమ క‌థ‌లోఒ న‌టిస్తోంది. ఇందులో ప్ర‌ముఖ న‌టుడు అంబీష్ త‌న‌యుడు అభిషేక్ హీరోగా న‌టిస్తున్నాడు.

'కాళీ' అనే టైటిల్ తో ఎస్ . కృష్ణ  తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి  క‌న్న‌డ మీడియా  వార్త‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో స‌ప్త‌మి గౌడ్ హీరోతో ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాల్లో మెప్పించ‌బోతుందిట‌.

హీరోతో ఇంటిమేట్ స‌న్నివేశాలు ర‌హ‌స్య గ‌దిలో చిత్రీక‌రిస్తున్నారుట‌. హీరో..హీరోయిన్ తోపాటు..ద‌ర్శ‌కుడు..కెమెరా మ్యాన్ ఆధ్వ‌ర్యంలోనే ఈ స‌న్నివేశాలు   షూట్ చేస్తున్నారుట‌.

క‌థ డిమాండ్ మేర‌కే ఇలాంటి స‌న్నివేశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా క‌న్న‌డ సినిమాల్లో రొమాంటిక్ స‌న్నివేశాలకు పెద్ద‌గా ఆస్కారం ఉండ‌దు. క‌థ‌కి ఇచ్చినంత ప్రాధాన‌త్య ఇలాంటి స‌న్నివేశాల‌కు ఇవ్వ‌రు. అయితే కాళీలో మాత్రం స్ర్కిప్ట్ డిమాండ్ చేయ‌డంతో స‌ప్తమి-అభిషేక్ ఘాటైన రొమాన్స్ కి ఆస్కారం క‌నిపిస్తుంది. ఈ సినిమాని వివిధ భాష‌ల్లో అనువ‌దించే ప్లాన్ లోఉన్న‌ట్లు తెలుస్తోంది.

అంబ‌రీష్ త‌న‌యుడు  కొన్ని సినిమాలు చేసినా ఇంకా స్టార్ హీరోగా ఎద‌గ‌లేదు. ఇటీవ‌ల‌ క‌న్న‌డ ఇండ‌స్ర్టీ స్పాన్ కూడా పెరిగింది. పాన్ ఇండియా కంటెంట్ నిమాలు   తెర‌కెక్కుతున్నాయి.   ఈ నేప‌థ్యంలో అభిషేక్  సినిమా ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారుట‌. దీంతో అభిషేక్  ఈ సినిమాకి ఎలాంటి పారితోషికం తీసుకోలేదుట‌. రిలీజ్ త‌ర్వాత మ‌రిన్ని సినిమాలు అదే బ్యాన‌ర్లో చేసేలా కొత్త అగ్రిమెంట్ కి  తెర తీసిన‌ట్లు  వినిపిస్తుంది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News