ఫీల్ గుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’. నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ‘సారంగ దరియా’ అనే పాటను ఈ మధ్యనే రిలీజ్ చేసింది యూనిట్. ఈ పాట యూట్యూబ్ లో నెవ్వర్ బిఫోర్ రికార్డులు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది.
ఫిబ్రవరి 28న సమంత అక్కినేని చేతుల మీదుగా ఆన్ లైన్లో విడుదలైన ఈ పాట.. మరుక్షణం నుంచే దూసుకెళ్లడం మొదలు పెట్టింది. అలా మొదలైన వ్యూయర్ షిప్.. అంతకంతకూ వేగంగా పెరుగుతూ టాలీవుడు రికార్డులను కొల్లగొడుతూ దూసుకెళ్లింది. టాలీవుడ్లో ఫాస్టెస్ట్ గా 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన సాంగ్ గా నిలిచింది.
కేవలం 14 రోజుల్లోనే ఈ మార్కును చేరుకుని సత్తా చాటింది సారంగా దరియా. ఈ పాటకన్నా ముందు ఒకే ఒక పాట ఉండడం.. అది కూడా సాయిపల్లవిదే కావడం విశేషం. మారీ చిత్రంలోని రౌడీ బేబీ పాట కేవలం 8 రోజుల్లోనే 50 మిలియన్ల మార్కును క్రాస్ చేసింది. ఆ తర్వాత స్థానాన్ని సారంగ దరియా ఆక్రమించింది.
ఇక గతేడాది శ్రోతలను ఉర్రూతలూగించిన అలవైకుంఠ పురములోని పాటలను కూడా ఈ సాంగ్ వెనక్కు నెట్టేసి సత్తా చాటింది. ‘బుట్ట బొమ్మ’ పాట 50 మిలియన్స్ వ్యూస్ సాధించడానికి 18 రోజుల టైం తీసుకోగా.. ‘రాములో రాములా’ పాటకు 27 రోజులు పట్టింది.
సుద్దాల అశోక్ తేజ సాహిత్యం.. మంగ్లీ గాత్రం.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. సాయిపల్లవి డ్యాన్స్.. ఈ నలుగురి మేలు కలయికలో వచ్చిన ఈ సాంగ్.. యూట్యూబ్ ను దున్నేస్తూ దూసుకెళ్తోంది. కాగా.. ఈ లవ్ స్టోరీ చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతోంది. మరి, సినిమా విడుదలైన తర్వాత.. ఈ పాట ఆడియన్స్ తో థియేటర్లోనే స్టెప్పులు వేయించడం ఖాయమని అంటున్నారు.