కమల్ హాసన్ ని భారత చలన చిత్ర పరిశ్రమకే తలమానికంగా భావిస్తారు అందరూ. కానీ శరత్ కుమార్ మాత్రం కమల్ అంత గొప్పోడేం కాదని, కృతజ్ఞత కూడా తెలియని వ్యక్తి అంటున్నాడు. తన కోసం కష్టపడ్డవాళ్లకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం చేతకాని కృతఘ్నుడి కింద తీసిపారేస్తున్నాడు. ఇదంతా ఆఫ్ స్క్రీన్ లో వెళ్లగక్కిన ఆవేదన కాదు.. ఏకంగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతులివి.
ఉత్తమ విలన్ వివాదంలో చిక్కుకుంటే 36 గంటలు నిద్ర లేకుండా కమల్ కి అండగా నిలబడ్డాడట శరత్ కుమార్. కనీసం ఆ విషయాన్ని గుర్తించలేదట కమల్. దీంతో ఈయనకు బాగా కోపం వచ్చిందట. ఇదంతా శరత్ కుమార్ ఎందుకు చెప్పాడంటే. అక్టోబర్ 18న నడిగర్ సంఘంగా పిలిచే సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి.
ప్రస్తుతం ఈ సంఘానికి అధ్యక్షుడు శరత్ కుమార్. మళ్లీ ఎన్నికల్లో అదే పదవికి పోటీ చేస్తున్నాడు. ఈయనకు ప్రధాన పోటీ నాజర్. విశాల్ - కార్తి వంటి హీరోలు నాజర్ అండగా నిలబడ్డారు. ఇప్పుడు కమల్ కూడా నాజర్ కే మద్దతు పలకడంతో.. పాత వివాదాలు బైటకు వచ్చాయి. అదీ సంగతి రాజకీయాలు ఎంటర్ అయ్యేపాటికి.. మహా నటుడు కూడా స్వార్ధపరుడు అయిపోయాడన్నమాట.