తప్పు చేసిన వారిని వదలనని.. అందుకోసం ఏకంగా పార్టీనే పెట్టారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తాజాగా ఇప్పుడాయన కారణంగా నష్టపోయామని.. తమకు న్యాయం చేయరేంటంటూ ఆయన బాధితులు కొందరు దీక్ష షురూ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ కారణంగా తాము నష్టపోయినట్లుగా చెబుతూ.. రోడ్డు మీద టెంట్ వేసి.. న్యాయం చేయాలంటూ పవన్ ఫోటోలు పెట్టి మరీ దీక్షను షురూ చేశారు.
పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం ఏమిటన్నది అందరికి తెలిసిందే. ఎంతో హైప్ క్రియేట్ అయిన ఆ సినిమా భారీ పరాజయానికి గురైంది. దీంతో.. ఆ సినిమా మీద ఉన్న నమ్మకంతో కొన్న డిస్ట్రిబ్యూటర్స్ దారుణంగా నష్టపోయారు.
అలా నష్టపోయిన వారంతా కలిసి పవన్ సన్నిహితుల్ని కలిసి.. తమ బాధల్ని చెప్పుకున్నారట. తాము త్వరలోనే పవన్‌తో మరో సినిమా చేస్తామని.. దాంతో నష్టాలు పూడుస్తామని హామీ ఇచ్చారట. పవన్ తాజా చిత్రం కాటమరాయుడిని పవన్ సన్నిహితుడు శరద్ మురార్ తో చేయటం.. ఆ సినిమా విడుదలకు దగ్గర అవుతున్నా.. సర్దార్ కారణంగా నష్టపో్యిన వారికి మాత్రం హక్కులు ఇవ్వలేదు. దీంతో.. తమకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే ఒకసారి ప్రెస్‌మీట్ పెట్టిన బాధితులకు ఎలాంటి భరోసా లభించకపోవటంతో ఇప్పుడు ఏకంగా నిరాహార దీక్షను మొదలెట్టారు.
తాము దేవుడిగా అనుకున్న పవన్ కల్యాణ్ వల్లనే తమకు అన్యాయం జరిగిందని.. న్యాయం చేయాలని వారు వాపోతున్నారు. ప్రెస్ మీట్లో పవన్ ను పల్లెత్తు మాట అనని వారు.. తాజా దీక్ష వేళ మాత్రం. మీరే మా దేవుడు అంటున్నా పట్టించుకోని పవన్ కల్యాన్ అని ఒకపక్క.. మాట ఇచ్చి మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న ప్రొడ్యూసర్ శరద్ మురార్.. పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ అంటూ ఫ్లెక్సీ పెట్టేసి దీక్షకు దిగారు. మరి.. వీరి దీక్షకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/