సూపర్ స్టార్ మహేష్ కథా నాయకుడిగా నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 1న రిలీజవుతోంది. పోటీలో నాలుగు సినిమాలు ఉన్నా సరిలేరు యూనిక్ స్టైల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే భారీగా థియేటర్లను లాక్ చేస్తోంది చిత్రబృందం. పనిలో పనిగా ప్రతి సోమవారం మాస్ ఎంబీ పాటలతో పాటు రకరకాల మార్గాల్లో బోలెడంత ప్రచారం చేశారు. సోషల్ మీడియా ల్లో సరిలేరు పోస్టర్లు.. టీజర్లు జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి.
2019 ముగించి 2020లో అడుగుపెడుతున్న సందర్భంగా ఇదివరకూ మహేష్ కుటుంబ సమేతంగా షిర్డీ బాబాని దర్శించుకుని అటుపై ముంబై ప్రయాణమైన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలన్నీ అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. 31 మిడ్ నైట్ ట్రీట్ ని ముంబైలోనే ప్లాన్ చేశారు మహేష్. సేమ్ టైమ్ ఎంబీ టీమ్ ఇదే మిడ్ నైట్ లో సరిలేరు.. ఫ్యామిలీ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
జనవరి 5న ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. చిరంజీవి అతిధిగా ఘనంగా జరగనున్న ఈ వేడుక ఘట్టమనేని ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ కానుంది. ప్రీరిలీజ్ ముందే ఒక కొత్త పోస్టర్ ని జనవరి 1 కానుకగా రిలీజ్ చేయడం ఆసక్తికరం. తాజా పోస్టర్ మహేష్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇందులో మహేష్-రష్మిక మందన- విజయశాంతి- రాజేంద్ర ప్రసాద్- రావుర మేష్- సంగీత తదితరులు ఈ ఫోటోలో ఉన్నారు. వీళ్లంతా ఒకే ఫ్యామిలీ. ఆర్మీ మేజర్ కృష్ణ మనోహర్ కుటుంబ చిత్రమిది. హ్యపీ న్యూఇయర్ 2020 అంటూ పోస్టర్ పై వేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అవస్థల పాలైన నేటి జనరేషన్ లో ఇలాంటి పోస్టర్లు కాస్త కన్నుల పండుగే మరి.