దేశంలో ఏ సినిమా రిలీజైనా ఒకటే టార్గెట్. బాహుబలిని కొట్టేయడం. ఎస్.ఎస్.రాజమౌళి- ప్రభాస్- ఆర్కా మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీని మించి కొత్త స్ట్రాటజీతో వెళ్లి ఆ సినిమా రికార్డులన్నిటినీ కొట్టేయాలన్న కసి కనిపిస్తోంది. అందుకు తగ్గ ప్లానింగ్ ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేం బాహబలి రికార్డుల్ని కొట్టేశాం అని చెప్పుకుంటేనే అదో గొప్పగా మారింది. కానీ ఎవరెన్ని గొప్పలు చెప్పుకున్నా `బాహుబలి` రికార్డుల్ని వేటాడేయడం అన్నది అంత తేలికైన పనేం కాదు. `బాహుబలి 2`ని టచ్ చేయడం మాట అటుంచితే - బాహుబలి -1ని కూడా సౌత్ లో వేరొక సినిమా దరిదాపుల్లో చేరడం అంత సులువేం కాదు. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ.300కోట్లు పైగా షేర్ వసూళ్లు ఉన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 250కోట్లు పైగా వసూలు చేసింది.
ఇలాంటి సంచలనం సృష్టించాలంటే అది అసంభవం. గతంలో ఇలయదళపతి విజయ్ నటించిన భారీ కమర్షియల్ చిత్రం `మెర్సల్` బాక్సాఫీస్ వద్ద రూ.200కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ప్రచారమైనా.. షేర్ విషయంలో 80కోట్ల లెక్కలు చెప్పారు. ఇప్పుడు `సర్కార్` రికార్డుల గురించి బోలెడంత ఊకదంపుడు ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కేవలం రెండే రెండు రోజుల్లో 100కోట్లు వసూలు చేసిందన్నది ఓ ప్రచారం. తమిళనాడులో `బాహుబలి1` ఓపెనింగ్ 2రోజుల రికార్డుల వరకూ టచ్ చేసి ఉండొచ్చు. కానీ లాంగ్ రన్ లో ఆ స్థాయిలో ఆడాలంటే కష్టం. బాహుబలి 1 చిత్రం తమిళనాడులోనూ రికార్డ్ స్థాయిలో ఆడడం అప్పట్లో చర్చకొచ్చింది.
ఆ క్రమంలోనే యూత్ లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. సర్కార్ ఓపెనింగులు ఓకే.. కానీ అసాధారణమైన బాహుబలి రికార్డుల్ని వేటాడడం సాధ్యమా? ఫుల్ రన్ లో బాహుబలి 600కోట్లు వసూలు చేసింది.. వరల్డ్ వైడ్ తొలి రోజు - మలిరోజు రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. మొదటి రోజు ఏకంగా 75కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత రజనీ కబాలి చిత్రం సుమారు 80కోట్ల వసూళ్లతో దీనిని అధిగమించిందని ప్రచారం సాగింది. ఇప్పుడు సర్కార్ ఆ స్థాయిని టచ్ చేసిందా? అంటే ట్రేడ్ లో సరైన వివరం లేదు. ఓన్లీ తమిళనాడు వరకూ సర్కార్ ఓపెనింగుల హడావుడి ఉండొచ్చు. కానీ వరల్డ్ వైడ్ రికార్డుల్ని బ్రేక్ చేసిందా? అన్నదానికి క్లారిటీ రావాల్సి ఉందింకా.