సరైనోడి సాంగ్ కి ఫారిన్ పాప డ్యాన్స్

Update: 2016-04-21 03:51 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ - సౌత్ లోనే కాదు.. ఫారిన్ దేశాల్లో కూడా బోలెడంత క్రేజ్ ఉంటుంది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు సరైనోడు సినిమాలో సాంగ్ కి, ఓ అల్లు అర్జున్ అభిమాని వేసిన డ్యాన్సులు.. ఆన్ లైన్ హల్ చల్ చేస్తున్నాయి. ఫేవరేట్ యాక్టర్ సాంగ్ కి ఫ్యాన్స్ డ్యాన్స్ చేయడంలో వింతేమీ ఉండదు కానీ.. ఈమె ఓ ఫారిన్ చిన్నది కావడమే ఇక్కడ అసలు విషయం.

సరైనోడు మూవీలో బ్లాక్ బస్టరే సాంగ్ ఇప్పటికే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగమ్మాయి అంజలి సన్నగా మారి - ఐటెం భామగా చిందులు వేసింది. ఈ పాటకు ఓ ఫారిన్ పోరి తెగ చిందులు వేసింది. మొత్తం పాట అంతటికీ డ్యాన్స్ చేసింది ఈ చిన్నది. అంతే కాదు.. అల్లు అర్జున్ వేసిన సిగ్నేచర్ స్టెప్ ను కూడా యాజిటీజ్ దించేసింది.

మధ్యమధ్యలో తన డ్రస్ పైకెళ్లిపోతుంటే.. కిందకు లాక్కుంటూ డ్యాన్స్ చేసింది కానీ.. ఎక్కడా బ్రేక్ మాత్రం వేయలేదు ఈ విదేశీ అభిమాని. ఇప్పుడీ ఫారిన్ పాప బ్లాక్ బస్టర్ డ్యాన్స్.. ఆన్ లైన్ తెగ షేర్ అయిపోతోంది. అఫ్ కోర్స్.. ఇలా షేర్ చేయమని.. తను స్టార్టింగ్ లోనే ఓ రిక్వెస్ట్ కూడా చేసింది లెండి.
Full View

Tags:    

Similar News