స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు.. ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి యూ/ఏ రేటింగ్ ని ఇస్తూ.. సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఇప్పుడీ సర్టిఫికేట్ చేతికి రావడంతో ఏప్రిల్ 22 రిలీజ్ కి అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
నిజానికి సరైనోడుని గతంలోనే సెన్సార్ కి పంపారు. అయితే.. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండడంతో.. ఏ సర్టిఫికేట్ ఇస్తామన్నారు సెన్సార్ వాళ్లు. మరి ఏ సర్టిఫికేట్ అంటే మల్టీప్లెక్సుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే అవకాశం ఉండదు. అందుకే కొన్ని సీన్లను రీషూట్ చేసి, యాక్షన్ సీక్వెన్స్ ల డోస్ తగ్గించి.. తమకు కావాల్సిన యూ/ఏ సర్టిఫికేట్ ని సాధించుకుంది సరైనోడు యూనిట్.
ఈ మూవీలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా.. కేథరిన్ థ్రెసా రాజకీయ నాయకురాలిగా కీలక పాత్ర పోషిస్తోంది. ఎస్ ఎస్ థమన్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి క్రేజ్ రాగా.. బన్నీ ఫాదర్ అల్లు అరవింద్ ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం అందుతున్న సెన్సార్ టాక్ ప్రకారం.. టాలీవుడ్ కి ఫస్ట్ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఇదే అంటున్నారు.