మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్య వచ్చిన భారీ సినిమాల రిజల్ట్ తేడా కొట్టినా సరే.. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘సరైనోడు’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. బన్నీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బిజినెస్ పరంగానూ రికార్డు నెలకొల్పింది. ఇక రిలీజ్ పరంగానూ బన్నీ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ మూవీ అంటున్నారు. మలయాళం కూడా కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతుందని అంచనా. అమెరికాలో మాస్ మసాలా సినిమాలకు ఆదరణ తక్కువే అయినప్పటికీ.. ఆ తరహా కథాంశంతోనే తెరకెక్కిన ‘సరైనోడు’ను అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. యుఎస్ లో 160కి పైగా లొకేషన్లలో ‘సరైనోడు’ సందడి చేయబోతోంది.
ముందు రోజు దాదాపుగా అన్ని లోకేషన్లలోనూ ప్రిమియర్ షోలు ప్లాన్ చేశారు. సినిమాకు డిమాండ్ బాగానే ఉండటంతో 25 డాలర్లకు అటు ఇటుగా ప్రిమియర్ షోల రేట్లు ఫిక్స్ చేశారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ప్రిమియర్ షోలతోనే బయ్యర్ సగం సేఫ్ అయిపోయే అవకాశముంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ‘సరైనోడు’కు భారీగా బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బెనిఫిట్ షోల సంఖ్యలో.. వసూళ్లలో కొత్త రికార్డులు నెలకొల్పింది. సినిమాకు టాక్ తేడా వచ్చినా సరే.. బెనిఫిట్ షోలతో భారీగా ఆదాయం రాబట్టారు. ‘సరైనోడు’ విషయంలోనూ అదే జరగబోతోంది. బన్నీ కెరీర్లోనే రికార్డు స్థాయిలో స్పెషల్ షోలు పడబోతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచే ‘సరైనోడు’ సందడి మొదలు కాబోతోంది.