బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది బెంగుళూరు అందం నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టినా అమ్మడి గ్లామర్ మాత్రం ఇండస్ట్రీకి తెగ నచ్చేసింది. అందం.. ఆకారం.. రూపం.. లావణ్యం అన్నీ ఉండటంతో వెండితెరపై అందచందాలు ఆరబోయడంలో ఏ మాత్రం మొహమాట పడే టైపు కాదు. దీంతో కొత్త అందాలకు వెల్ కం చెప్పే టాలీవుడ్ దృష్టి ఆమెపై పడింది.
నాగచైతన్య హీరోగా ప్రేమమ్ ఫేం డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాకు నిధిని హీరోయిన్ గా ఎంచుకున్నారు. తెలుగు తెరకు తాను కొత్తకానీ తెలుగు నేలకు కాదంటోంది ఈ సుందరాంగి. నిధి బెంగుళూరులో పెరిగినా తన మూలాలు హైదరాబాద్ లోనే ఉన్నానంటోంది. తన తల్లి సొంతూరు హైదరాబాద్ అని.. ఆ రకంగా ఈ సిటీ తనకు సెకండ్ హోమ్ టౌన్ అని చెప్పుకొస్తోంది. అంతే కాదు... ఈ సొగసరి తెలుగు మాట్లాడలేదు కానీ అర్ధం చేసుకోగలగదుట.
సవ్యసాచి అంటే అర్ధం రెండు చేతులతో బాణం వేయగలిగినవాడు అని అర్ధం. అలాగే హీరోయిన్ నిధి కూడా బేసిగ్గా కన్నడతోపాటు తెలుగు సైతం తెలిసిన భాషే అంటోంది. అంతేకాదు.. చిన్నప్పటి నుంచి హిందీలోకి డబ్బింగ్ అయిన తెలుగు సినిమాలన్నీ చూస్తూనే పెరిగానని అంటోంది. మొత్తానికి తెలుగు ప్రేక్షకులను మెప్పించే టాలెంట్ మొత్తం తనదగ్గర ఉందని హింటిస్తోంది.