నిజామాబాద్ వ‌ద‌ల‌ని క‌మ్ముల‌

Update: 2020-02-06 15:30 GMT
టాలీవుడ్ ద‌ర్శ‌కుల సెంటిమెంట్లపై రెగ్యుల‌ర్ గా గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. ఒక సినిమా హిట్ట‌యితే అందుకు ప్ర‌ధాన‌ కార‌ణాన్ని వెతికి దానిని సెంటిమెంటుగా భావిస్తారు. కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్లు వెచ్చించే ఈ రంగంలో ప్ర‌తిదీ సెంటిమెంటుగా మారుతుంటుంది. క‌థ‌లు రాయ‌డం నుంచి.. ముహూర్త‌పు స‌న్నివేశం వ‌ర‌కూ.. తెర‌కెక్కించే లొకేష‌న్ల ఎంపికను సైతం సెంటిమెంటుగా ఫీల‌య్యేవాళ్లు ఉంటారు.

ఆ కోవ‌లో చూస్తే శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల్లో నైజాం ప్రాంతం యాస భాష సంస్కృతి త‌ప్ప‌నిస‌రి. అదో సెంటిమెంటుగానూ మారింది ఆయ‌న‌కు. ఇక స్వ‌త‌హాగా హైద‌రాబాద్ వాసి కాబ‌ట్టి క‌మ్ముల‌కు ఈ క‌ల్చ‌ర్ తో ఉన్న అనుబంధం అలాంటిది. అదే ఆయ‌న ప్ర‌తి సినిమాలోనూ ప్ర‌తిబింబిస్తూ ఉంటుంది. ఇంత‌కుముందు ఫిదా చిత్రాన్ని నిజామాబాద్ (తెలంగాణ‌)లో మెజారిటీ భాగం తెర‌కెక్కించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. అందుకే ఇప్పుడు నిజామాబాద్ సెంటిమెంటును క‌మ్ముల వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న అక్కినేని నాగ‌చైత‌న్య - సాయి ప‌ల్ల‌వి జంట‌గా ల‌వ్ స్టోరి తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకి నిజామాబాద్ సెంటిమెంటును విడిచిపెట్ట‌డం లేదు క‌మ్ముల‌. కానీ ఫిదా అనేది ఏదో ఫ్లూక్ లో హిట్ అయిపోయింది కానీ.. ప్ర‌తిసారీ అలా జ‌రుగుతుందా?  ఇప్పుడు నాగ‌చైత‌న్య లాంటి పెర్ఫామ‌ర్ తో సాయి ప‌ల్ల‌వి ని పెట్టి సినిమా చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. పైగా నిర్మాత సునీల్ నారంగ్ కి బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. ఆయ‌న‌ ముట్టుకున్న ప్ర‌తి ప్రాజెక్ట్ ఢ‌మాల్ అవుతున్నాయిగా! అంటూ కొత్త స‌మీకర‌ణాల్ని సెంటిమెంటును బ‌య‌ట‌కు తీస్తున్నారు. మ‌రి సెంటిమెంటు చూస్తే ఈ రూట్లోనూ చూస్తారుగా అన్న గుస‌గుస ఫిలింస‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే సెంటిమెంటు కంటే కంటెంట్ తో కొడితేనే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నార‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.


Tags:    

Similar News