ఐఐటీ గౌహతికి వెళుతున్న కమ్ముల

Update: 2016-02-04 03:59 GMT
ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు ఓ క్రెడిబిలిటీ ఉంది. హ్యాపీడేస్ తర్వాత టాప్ రేంజ్ కి వెళ్లిపోయిన ఈ డైరెక్టర్..  తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ - అనామిక ఫ్లాప్ లతో వెనకబడ్డాడు. అలాగని కమ్ముల ట్యాలెంట్ పై ఎవరికీ అనుమానాలు కూడా ఉండవు. మహేష్ బాబుతో ఓ మూవీ కార్డ్స్ పై ఉందంటే.. ఈయన సత్తా ఏంటో అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈయన తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన హ్యాపీడేస్ ని హిందీలో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు.

సంవత్సరాల క్రితం నుంచి హ్యాపీడేస్ ని బాలీవుడ్ తీసుకెళ్లాలని అనుకుంటున్నా.. ఇన్నేళ్లకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. హ్యాపీడేస్ తెలుగు వెర్షన్ కి సంబంధించి, సీబీఐటీలో మూవీని షూట్ చేశారు. ఆ ప్రెమిసెస్, అక్కడ జరిగే ఎపిసోడ్స్ చుట్టూనే మూవీ తిరుగుతుంది. సీబీఐటీలో షూటింగ్ కి యాక్సెప్ట్ చేయకపోతే, అసలు హ్యాపీడేస్ ని తీసేవాడిని కాదని.. శేఖర్ కమ్ముల చెబుతూ ఉంటాడు. ఇప్పుడు బాలీవుడ్ కోసం ఇలాంటి ఓ అట్మాస్ఫియర్ ఉన్న ఇనిస్టిట్యూట్ ని ఫిక్స్ చేసుకున్నాడు కమ్ముల.

బాలీవుడ్ హ్యాపీడేస్ కోసం ఐఐటీ గౌహతికి ఫిక్సయ్యాడు ఈ డైరెక్టర్. ఈ విషయాన్ని ఐఐటీ గౌహతి ఫోటోతో కలిపి ట్వీట్ చేశాడీయన. 'హ్యాపీ డేస్ ఆర్ హియర్ ఎగైన్' అంటూ కమ్ముల చేసిన ట్వీట్ తో.. బాలీవుడ్ రీమేక్ సంగతిని అధికారికంగా అనౌన్స్ చేసినట్లు అయింది.
Tags:    

Similar News