'ఫిదా' చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈయన దర్శకత్వంలో గతంలో వచ్చిన చిత్రాలకు ఫిదా చిత్రం పూర్తి విరుద్దంగా నిలిచింది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కి, కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో శేఖర్ కమ్ముల కమర్షియల్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఫిదా విడుదలైన చాలా రోజుల వరకు శేఖర్ కమ్ముల తర్వాత సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎట్టకేలకు కొన్ని నెలల క్రితం ఏషియన్ సునీల్ నిర్మాణంలో ఒక సినిమాను చేస్తున్నట్లుగా శేఖర్ కమ్ముల నుండి సమాచారం వచ్చింది.
డాన్స్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం కొత్త వారిని ఎంపిక చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎవరిని ఈ చిత్రంలో నటింపజేస్తున్నాడు, అసలు కథ ఏంటీ, సినిమా వివరాలు ఏంటీ అనే విషయమై గోప్యంగా ఉంచుతూ వస్తున్నాడు. షూటింగ్ ప్రారంభం అయ్యిందా లేదా అనుకుంటున్న సమయంలో షూటింగ్ మూడు పాటలు, కాస్త టాకీ పార్ట్ మినహా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. సినిమాకు చాలా కీలకమైన మూడు పాటలను చిత్రీకరించేందుకు దాదాపు నెల రోజులకు పైగా టైం తీసుకోబోతున్నాడట. ఇక టాకీ పార్ట్ ను దుబాయిలో చేస్తాడనే సమాచారం కూడా అందుతోంది.
ఈమద్య కాలంలో క్లాప్ కొట్టినప్పటి నుండి ప్రతి రోజు సినిమా గురించి ఏదో ఒక వార్తతో మీడియాలో ఉండాలని చూస్తూ ఉన్నారు. సినిమాను ఎప్పుడు జనాల్లో నాన్చాలని భావిస్తున్న సమయంలో శేఖర్ కమ్ముల మాత్రం తన సినిమా గురించి అసలు ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ చిత్రంను సైలెంట్ గా వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించబోతున్న నటీనటుల వివరాలను కూడా బయటకు రాకుండా శేఖర్ కమ్ముల జాగ్రత్త పడుతున్నాడు. సోషల్ మీడియా ఇంత పెరిగిన నేపథ్యంలో ఈ చిత్రంకు సంబంధించిన విషయాలు బయటకు రాకపోవడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొత్తానికి శేఖర్ కమ్ముల సైలెంట్ గా సక్సెస్ ను కొట్టేస్తాడేమో చూడాలి.