ఇదేమి సెల్ఫీ పిచ్చి గురూ?

Update: 2015-08-19 02:24 GMT
రోజుకో ట్రెండ్‌ పుట్టుకొస్తోంది. సెల్ఫీలు దిగడం అనేది ఇప్పటికే పాతబడిపోయినా యువతరం ఇంకా దానినే అనుసరిస్తోంది. ఎవరైనా సెలబ్రిటీ కనబడితే చాలు మీద పడిపోయి సెల్ఫీలు దిగిపోవడాన్ని ఫ్యాషన్‌ గా భావిస్తోంది. ఒకప్పుడు అభిమానం పీక్స్‌ కెళ్లింది. పిచ్చి ముదిరింది అని చెప్పుకున్నట్టే ఇక నుంచి ఈ సెల్ఫీ ల పిచ్చిని కూడా చెప్పుకోవాల్సొస్తోంది. అలాంటి పిచ్చిలో ఎవరెవరు ముదిరిపోయారు? అని వెతికితే తెలిసిన సంగతులివి.

=బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాకి విదేశాల్లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ అమ్మడు అమెరికాలో క్వాంటికో సిరీస్‌ లో నటించినప్పుడు చాలానే బిల్డప్‌ ఇచ్చింది. అప్పుడు దిగిన కొన్ని సెల్ఫీలు అమ్మడికి బోలెడంత పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి.

=యువహీరో రామ్‌ సెట్‌ లో ఉంటే ఒకటే అల్లరి. ఈయన బ్రహ్మానందంతో కలిసినప్పుడు సెల్ఫీలు దిగి హల్‌ చల్‌ చేశారు. ఆ ఫోటోలు ఆన్‌ లైన్‌ లో హాట్‌.

=ఇక సైమా అవార్డుల వేడుకలో అయితే హీరోయిన్‌లు అల్లరే అల్లరి. ఛార్మి, శ్రుతిహాసన్‌ ల వెంట పడి మరీ అభిమానులు సెల్ఫీలు దిగారు. నాగచైతన్య కూడా తెగ హల్‌ చల్‌ చేశాడు.

=శ్రుతిహాసన్‌ కి దర్శకులతోనూ సెల్ఫీలు దిగే పిచ్చి ఉంది. రేసుగుర్రం దర్శకుడు సురేందర్‌ రెడ్డితోనూ ఈ భామ సెల్ఫీ దిగి ఆన్‌ లైన్‌ లో పబ్లిసిటీ కి పెట్టింది.

=కృతిసనోన్‌ చెల్లెలు సుపుర్‌ తో సెల్ఫీ దిగింది. దీనికి ఫ్రెండ్షిప్‌ అంటూ ట్యాగ్‌ లైన్‌ పెట్టి మరీ సోదరిని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేసింది.

=తాప్సీ తన సోదరి షగున్‌ తో కలిస్తే అల్లరే అల్లరి. సెల్ఫీల అల్లరిలో ఈ ఇద్దరినీ కొట్టేవారే లేరు.

=ప్రతి సెల్ఫీ వెనక సరదాతో పాటే అర్థం పరమార్థం కూడా ప్లాన్‌ చేసేవారెందరో.
Tags:    

Similar News