తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మన్నవ బాలయ్య (94) కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య నిర్మాతగా..దర్శకుడిగా..కథా రచయితగా ప్రతిభ చూపారు.
గుంటూరు జిల్లా చావపాడులో గురవయ్య- అన్నపూర్ణమ్మ దంపతులకు బాలయ్య ఏప్రిల్ 9-1930న జన్మించారు. మెకానీకల్ ఇంజనీరింగ్ చదివారు. 1952 లోనే బీఈ పూర్తిచేసారు. 1957 వరకూ మద్రాసు..కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసారు.
మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. అప్పట్లోనే ఆయన నాటకాలు వేసేవారు. బాలయ్యను చూసిన కొందరు హిందీ నటుడు అశోక్ కుమార్ లాగా ఉన్నావు అనేవారు. దాంతో ఆయనకు సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. మిత్రుల ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టారు.
1958లో 'ఎత్తుకు పై ఎత్తు' సినిమాలో నాయక పాత్ర వేశారు. తరువాత 'భాగ్యదేవత'.. 'కుంకుమరేఖ' చిత్రాల్లో నటించారు. 'భూకైలాస్' చిత్రంలో ఎన్.టి.రామారావు.. అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి నటించే అవకాశం ల వచ్చింది. అందులో శివుని పాత్రలో నటించారు. అటుపై 'చెంచులక్ష్మి'.. 'పార్వతీకల్యాణం' నుండి నేటి వరకు 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించారు.
1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి 'నేరము-శిక్ష'.. 'అన్నదమ్ముల కథ'.. 'ఈనాటి బంధం ఏనాటిదో' ( లాంటి చిత్రాలు నిర్మించారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వం 'చెల్లెలి కాపురం' చిత్రాన్ని ఉత్తమ చిత్రముగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారంతో బహూకరించింది. ఇంకా కొన్ని అవార్డులు..రివార్డులు అందుకున్నారు. బాలయ్య స్వీయ దర్శకత్వంలో 'పోలీస్ అల్లుడు' .. 'ఊరికిచ్చిన మాట' లాంటి చిత్రాలు నిర్మించారు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చారు. ఆ తర్వాత చిత్రాల్లో టి.వి. సీరియల్స్ లోనూ నటించారు.
బాలయ్య మృతిపట్ల పలవురు సినీ..రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే బాలయ్య పుట్టిన రోజు నాడే కన్నుమూయడం బాధాకరం.