ఆ ఐపీఎస్ అధికారితో ఆ న‌టి విభేధాలు

Update: 2019-11-28 17:30 GMT
ఇది అలాంటిలాంటి గొడవ కాదు. ఒక లేడీ ఐపీఎస్ అధికారి.. ఒక సీనియ‌ర్ న‌టి కాపురంలో నిప్పులు పోసింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో ఆల్మోస్ట్ ఆ గొడ‌వ డ‌ర్టీపిక్చ‌ర్ నే త‌ల‌పించింది. స‌ద‌రు సీనియ‌ర్ న‌టి భ‌ర్త‌ వేరొక ఐఏఎస్ స్థాయి మ‌హిళ‌ను పెళ్లాడేయ‌డం.. కాపురం షిఫ్ట్ అయిపోవ‌డం.. అటుపై ఆ గొడ‌వ‌లోకి స‌ద‌రు సీనియ‌ర్ లేడీ ఐపీఎస్ ఫింగ‌రింగ్ చేయ‌డం వ‌గైరా గొడ‌వ కోర్టు కేసుల వ‌ర‌కూ వెళ్లింది. ఈ ఎపిసోడ్ అంతా డ‌ర్టీ ప్ల‌స్ డ‌ర్టీ వోల్ స్క్వేర్ పిక్చ‌ర్ కి త‌క్కువేమీ కాదు. 14 ఏళ్ల కొడుకు ఉన్న ఆ న‌టి మీడియా ముందు త‌న పెళ్లికి సంబంధించిన‌ అన్ని ఆధారాల్ని చూపించి చాలా పెద్ద గొడ‌వే చేశారు. పైగా భ‌ర్త విడాకులు లేకుండానే వేరొక యువ‌తిని పెళ్లాడేయ‌డం పైనా ప్రూఫ్ లు ప్ర‌ద్శించించారు.

ఈ గొడ‌వ మొత్తాన్ని టీవీ చానెళ్లు.. యూట్యూబ్ చానెళ్లు ఓ రేంజులో టీఆర్పీ ఆట ఆడేసుకున్నాయి. స‌ద‌రు న‌టి పేరు యూట్యూబ్ లో టైప్ చేస్తే చాలు ఒక‌టికి ప‌ది వీడియోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాయి. ఇక ఈ ఎపిసోడ్ లో స‌ద‌రు న‌టి కి ఆ సీనియ‌ర్ లేడీ ఐపీఎస్ అధికారితో విభేధాలు స‌మ‌సిపోయాయా? అంటే ఇప్ప‌టికీ స‌సేమిరా అని తెలుస్తోంది.

అంతేకాదు.. ఇప్పుడు త‌న భ‌ర్త త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చినా స‌ద‌రు సీనియ‌ర్ న‌టి ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌న‌ని వార్నింగ్ కూడా ఇచ్చేసింది. త‌న కాపురంలో క‌ల‌త‌ల‌కు కార‌ణ‌మైన స‌ద‌రు ఐపీఎస్ పై ఇప్ప‌టికీ ఆ న‌టి భ‌గ‌భ‌గ మండిపోతోంద‌ట‌.

ఫ్యామిలీ ఎఫైర్స్ లో వేలు పెడితే ఇంతే! కాలి బూడిదైపోవాల్సిందే ఎంత‌టివారైనా!! స్నేహం కోసం సాయం చేసినా పాపం మూట‌గ‌ట్టుకున్న‌ట్టే. ఇలాంటి గొడ‌వ‌ల వ‌ల్ల ఐపీఎస్ కేడ‌ర్ కే అవ‌మానం. ఇక‌పోతే స‌ద‌రు లేడీ ఐపీఎస్ అధికారి అప్ప‌ట్లో సినీఇండస్ట్రీకే చెందిన‌ ఓ కాల‌నీ వాళ్ల‌తోనూ అడ్డ‌గోలుగా గొడవ ప‌డ‌డం సంచ‌ల‌న‌మైంది. దాదాపు 10వేల మంది నివ‌శించే సినిమావాళ్ల కాల‌నీకి వెళ్లే రోడ్ కి అడ్డంగా గోడ క‌ట్టించి త‌న బ‌లుపు చూపించింది. దీంతో ఆ పంచాయితీ కాస్తా ఏకంగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి .. ఐటీ మంత్రి రేంజు వాళ్ల ద‌గ్గ‌రకే వెళ్లింది. ఎట్ట‌కేల‌కు గోడ ప‌డ‌గొట్టి హాయిగా రోడ్ వేసుకున్నారు ఆ కాల‌నీ వాసులు. మొత్తానికి ఐపీఎస్ అధికారిణి మాత్రం ఆ కాల‌నీ వాసుల గుండెల్లో చిర‌కాలం నిలిచిపోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పైగా ఆ సీనియ‌ర్ న‌టి ఫ్యామిలీ గొడ‌వ‌ల్లో త‌ల‌దూర్చి ఇంకా ఫేమ‌స్ అయిపోయింది. ఇంత‌కీ ఆ ఐపీఎస్ ఎవ‌రో.. ఆ సీనియ‌ర్ న‌టి ఎవ‌రో మీరే గెస్ చేయండి. బాగా పాపులారిటీ ఉన్న‌వాళ్లే ఆ ఇద్ద‌రూ.
Tags:    

Similar News