ప్రస్తుతం టీవీల్లో రియాల్టీ షోల హవా నడుస్తోంది. ఇండియన్ బుల్లితెర రియాలిటీ షోల చరిత్ర లోనే బిగ్ బాస్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా గతంలో వచ్చిన ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ సాధించింది. అయితే, అదే స్థాయిలో ఆ షోకు విమర్శలు వచ్చాయి. బిగ్ బాస్ షో అనగానే పార్టిసిపెంట్స్ మధ్య రకరకాల కాంట్రవర్సీలూ, గొడవలే గుర్తుకు వస్తాయి.
తమిళ బిగ్ బాస్ షోపై తమిళ నటి - దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ అదొక చెత్త షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది .ఈ షో వల్ల కుటుంబంలో కలతలు రేగడం ఖాయమని ఆమె తెలిపింది. భారతీయతకు ఆ షో చెడ్డ పేరు తీసుకువస్తుందని, దక్షిణాది వాళ్లకు మరింత చేటు చేస్తుందని వ్యాఖ్యానించింది.ఆ షో కారణంగా పార్టసిపెంట్స్ వ్యక్తిగత మనోభావాలు దెబ్బ తింటాయని తెలిపింది. స్వేచ్చగా బతికే వాళ్ల ను ఒక చోట బంధించినట్లు అవుతుందని చెప్పింది.
తనను కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనమని కోరారని , పది కోట్ల రూపాయలు ఇచ్చినా నేను ఆ షోలో పార్టిటసిపేట్ చేయనని తెగేసి చెప్పానని అంటోంది. ఈ షో లో ఆడ - మగ అనే తేడా లేకుండా అపరిచితులతో కలిసి ఒక ఇంట్లో ఉండాలని, రెండు నెలల పాటు సాగే ఈ వ్యవహారం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బ తింటాయని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను ఆ షోలో పాల్గొనడానికి సుముఖత చూపలేదని స్పష్టం చేసింది.
ఈ ప్రోగ్రామ్ ని తమిళ - కన్నడ ఇండస్ట్రీలో కూడా తీసుకు వచ్చారు. తమిళం లో ఈ షో ని కమల్ హాసన్ నిర్వహిస్తున్నాడు . ఇక తెలుగు బుల్లితెరపై మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ నెల 16 నుంచి రాబోతుంది. తెలుగు టీవీ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' సందడికి డేట్ ఫిక్స్ అయ్యింది. తొలిసారి బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండటంతో టీవీ మార్కెట్ పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.