టాలీవుడ్ లో దర్శకులకు కొదవేం లేదు. కానీ.. ఆచితూచి అన్నట్లుగా సినిమాలు తీసే దర్శకులు ఈ మధ్యన ఎక్కువ అయ్యారు. అలాంటికోవలోకే వస్తారు దర్శకులు కొరటాల శివ. ఆయన తీసే ప్రతి సినిమాలో మాస్ అంశాలు మాత్రమే కాదు.. ఒక ఫీల్ గుడ్ ఫీలింగ్ తో పాటు.. ఒక పెద్ద కథ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రాంచరణ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణంలో ఉంది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ సినిమాకు సమయం వేస్ట్ అయ్యింది. ఆ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని భావించినా.. అనుకోని అవంతరాలు ఎదురయ్యాయి.
ఇప్పుడా సవాళ్లను అధిగమించి ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన చిత్ర ట్రైలర్.. సినిమా మీద మరింత ఆసక్తి పెంచేలా చేసిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాల్ని పాన్ ఇండియా మోడల్ కు తగ్గట్లుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఆచార్యను మొదట్నించి సౌత్ కు మాత్రమే పరిమితం అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదల నేపథ్యంలో రాంచరణ్ కు వచ్చిన ఫాలోయింగ్ వేళ.. ఆచార్యను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళతారా? అన్న ప్రశ్నకు.. ఏ మాత్రం ఊహించని ఆన్సర్ ఇచ్చారు కొరటాల.
తనకు పాన్ ఇండియా అనే పదమే నచ్చదని తేల్చేశారు. ఒకప్పుడు ఒక భాషలో ఒక సినిమా బాగా ఆడితే.. దాని హక్కులు కొనుక్కొని అదే కథని వేరే నటులతో తీసేవాళ్లని.. కాకుంటే ఇప్పుడు ఏ సినిమాను ఏ భాషలో తీసినా.. దాన్ని అందరూ చూసేలా మార్కెట్ సౌలభ్యం ఏర్పడిందన్నారు. అయితే.. ఆచార్యను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళతారా? లేదా? అన్నది నిర్మాతకే వదిలేసిన వైనం చూస్తే.. కొరటాల తాను నమ్మిన దానికి ఎంతలా స్టిక్ అవుతారో అర్థమవుతుంది. ఇక.. ఎన్టీఆర్ తో తీసే మూవీని పాన్ ఇండియాలా రూపొందిస్తారా? అన్న దానిపైనా ఆయన క్లారిటీ ఇచ్చేశారు.
ఎన్టీఆర్ మూవీ కోసం మంచి కథే రాశానని.. ఎక్కువ మంది చూడాలని తాను కోరుకుంటానన్న ఆయన.. తెలుగు ప్రేక్షకులకు ఒక కథ.. పాన్ ఇండియా మార్కెట్ కోసం మరో కథ ఉండదని.. పెద్ద.. బలమైన కథల్ని రాస్తే ఎవరైనా భాషతో సంబంధం లేకుండా సినిమా చూస్తారన్నారు. జూన్ నుంచి షూట్ లోకి వెళుతున్నట్లు చెప్పారు. మొత్తానికి కొందరు దర్శకుల మాదిరి కాకుండా పాన్ ఇండియా మాటకు కొరటాల పెద్దగా రియాక్టు కారన్న విషయం తాజా మాటలతో స్పష్టమైందని చెప్పాలి.