ఆర్‌ఆర్‌ఆర్‌ పున: ప్రారంభంపై సెంథిల్‌ స్పందన

Update: 2020-07-26 10:30 GMT
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్‌ చరణ్‌ ఎన్టీఆర్‌ లు హీరోుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌ తో దూసుకు వెళ్తున్న సమయంలో కరోనా కారణంగా ఆగిపోయింది. గత నాలుగు నెలలుగా షూటింగ్‌ నిలిచి పోయింది. గత నెలలో ప్రభుత్వం షూటింగ్స్‌ అనుమతులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన వెంటనే రాజమౌళి షూటింగ్‌ కు సిద్దం అయ్యాడు.

గత నెల చివర్లో సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టే ఉద్దేశ్యంతో మొదట టెస్టు షూట్‌ చేయాలనుకున్నారు. కాని అది కూడా చేయలేదు. షూటింగ్‌ ఎప్పటికి ప్రారంభం అయ్యేది తెలియడం లేదు. ఈ సమయంలో ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ వ్యవహరిస్తున్న సెంథిల్‌ కుమార్‌ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు.

సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టాలనుకున్న మాట వాస్తవమే. తక్కువ మందితో షూటింగ్‌ కు వెళ్లాలని అనుకున్నాం. సాదారణంగా ప్రతి రోజు 500 మంది సెట్‌ లో ఉండే వారు. కరోనా కారణంగా 50 నుండి 60 మందితో షూటింగ్‌ చేయాలని సన్నాహాలు చేశాం.

ఆ సమయంలోనే కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో టెస్ట్‌ షూట్‌ కూడా చేయకుండానే ఆలోచన ఉపసంహరించుకున్నారు రాజమౌళి. పరిస్థితులు చక్కబడే వరకు షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం లేదని అన్నాడు. రెండు మూడు నెలల తర్వాత షూటింగ్‌ పున: ప్రారంభం అవుతుందని ఆశాభావంతో ఎదురు చూస్తున్నట్లుగా సెంథిల్‌ పేర్కొన్నాడు.
Tags:    

Similar News