సీక్వెల్స్‌ క్రేజ్‌.. చిన్న సినిమాలైన కోట్లు బిజినెస్‌

Update: 2022-02-06 11:33 GMT
చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైన సీక్వెల్‌ అనగానే ప్రేక్షకుల్లో పాజిటివ్‌ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ సినిమాలకే సీక్వెల్స్ వస్తూ ఉంటాయి. సక్సెస్‌ సినిమా కు సీక్వెల్‌ చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. అందుకే సీక్వెల్ అంటూ మొదలు పెట్టింది మొదలు విడుదల అయ్యే వరకు ఆ సినిమా పై జనాల్లో ఆసక్తి ఉంటుంది. సీక్వెల్స్ లో ఎక్కువ శాతం సక్సెస్ లు ఉండటం వల్ల కూడా వాటికి క్రేజ్‌ భారీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

సీక్వెల్‌ సినిమాల బిజినెస్‌ భారీగా ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో నిఖిల్‌ హీరోగా నటిస్తున్న కార్తికేయ సీక్వెల్‌ కార్తికేయ 2 కు భారీ బిజినెస్ అవుతోంది. కార్తికేయ 2 సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది. ఈ లోపే ఓటీటీ మరియు శాటిలైట్‌ బిజినెస్ క్లోజ్ అయినట్లుగా సమాచారం అందుతోంది.

2014 సంవత్సరంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నిఖిల్‌ హీరోగా స్వాతి రెడ్డి హీరోయిన్ గా చందు మొండెటి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా కు సీక్వెల్‌ మొదలు అయ్యి చాలా కాలం అయ్యింది. అన్ని సినిమాల మాదిరిగానే కరోనా వల్ల కార్తికేయ 2 కూడా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు పరిస్థితులు మెరుగు పడటంతో పలు సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే కార్తికేయ 2 సినిమాను కూడా అతి త్వరలోనే విడుదల చేసేందుకు తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కార్తికేయ 2 సినిమాపై మంచి బజ్ క్రియేట్‌ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. దాంతో జీ సంస్థ ఓటీటీ మరియు శాటిలైట్‌ రైట్స్ ను దాదాపుగా 17 కోట్ల రూపాయలను పెట్టి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

థియేటర్‌ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు ఈ ఒప్పందం కుదిరింది. ఇక థియేటర్‌ రైట్స్ ద్వారా మరింత మొత్తంను ఈ సినిమా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కార్తికేయ హిట్ మూవీ కనుక.. ఆ హిట్‌ మూవీ కి సీక్వెల్‌ గా వస్తున్న సినిమా కార్తికేయ 2 కనుక మంచి బజ్ ఏర్పడింది. అందువల్లే భారీగా బిజినెస్ చేస్తోంది.

పెట్టిన బడ్జెట్‌ కంటే అదనంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే నిర్మాతకు దక్కబోతుంది. ఇందుకే చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ కూడా సీక్వెల్స్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరో సినిమా ఎఫ్ 2 కు సీక్వెల్‌ గా రూపొందిన ఎఫ్‌ 3 కి కూడా భారీగా బజ్ ఉంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News