నేడు ఎన్నికల రిజల్ట్ తేలిపోతోంది. వైకాపా అధినేత వైయస్ జగన్ స్పష్టమైన మెజారిటీతో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహకాల్లో ఉన్నారు. మే 30వ తేదీని ప్రమాణ స్వీకారానికి లాక్ చేశారని ప్రచారమవుతోంది. ఈ రిజల్ట్ గడబిడలో పడి సినిమాలేవి రిలీజవుతున్నాయో కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. అయితే ప్రతి శుక్రవారాన్ని మించి మూకుమ్మడిగా ఈ శుక్రవారం ఏకంగా ఏడు సినిమాలు రిలీజవుతున్నాయి. ఇవన్నీ రిజల్ట్ కోసం వెయిటింగ్. ఎన్నికల రిజల్ట్ తప్ప సినిమాల రిజల్ట్ గురించి ఆలోచించరా? కాస్తంత పట్టించుకోండి ప్లీజ్! అంటున్నారు మేకర్స్.
వారం వారం రిలీజ్ ల ముచ్చట సాగుతున్నా.. ఈ వారంలో వచ్చే వాటిలో కాస్తో కూస్తో కాజల్ `సీత` గురించి తప్ప వేరే ఏ సినిమా రిలీజవుతోందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ట్రైలర్ లో అభినవ సీతగా కాజల్ ఒక్క తన్ను తంతున్న సీను తప్ప ఏదీ కనిపించడం లేదు. కాజల్ .. బెల్లంకొండ సహా తేజకు ఇది ఎంతో ఇంపార్టెంట్ మూవీ. ఇకపోతే ఈ సినిమాతో పాటు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా `లీసా 3డి` (తమిళ్-తెలుగు) ఈ శుక్రవారం రిలీజవుతోంది. తెలుగమ్మాయ్ అంజలి కథానాయికగా నటించిన ఈ సినిమా 3డి సినిమా కాబట్టి ఏమైనా ఆడియెన్ పై ప్రభావం చూపుతుందా? లారెన్స్ `కాంచన 3` సైలెంటుగా వచ్చి హిట్ కొట్టినట్టే ఏదైనా మ్యాజిక్ చేస్తుందా? అన్నది చెప్పలేని పరిస్థితి.
వరలక్ష్మి శరత్ కుమార్- కేథరిన్- రాయ్ లక్ష్మీ .. ఈ ముగ్గురు భామలు నాగినులుగా నటించిన డబ్బింగ్ చిత్రం `నాగకన్య` ఈ శుక్రవారమే రిలీజవుతోంది. పాత ఫార్ములాతో వస్తున్నా ముగ్గురు భామలపైనే హోప్స్. దీంతో పాటు లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ లగడపాటి హీరోగా చేస్తున్న `ఎవడు తక్కువకాడు` మరో చిన్న తెలుగు సినిమా `నేను లేను` రిలీజవుతున్నాయి. వీటికి ప్రచారం సున్నా కావడంతో జనాలకు పెద్దంతగా తెలిసిందేం లేదు. ఎన్నికల రిజల్ట్ ఇలా భాజపా-ఎన్డీయేకి అనుకూలంగా మారిన క్షణాన వెంటనే `పీఎం నరేంద్ర మోదీ` బయోపిక్ రిలీజ్ తేదీ ఫిక్సయ్యింది అంటూ పోస్టర్ ని లాంచ్ చేశారు. దీంతో పీఎం మోదీ బయోపిక్ ఈ శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రలో నటించగా ఈ సినిమా కాషాయ మూకలకు పండుగేనని చెప్పాలి. విల్ స్మిత్ లాంటి ఛరిష్మా ఉన్న హాలీవుడ్ స్టార్ నటించిన `అల్లా ఉద్దీన్` చిత్రానికి `ఎఫ్ 2` స్టార్స్ వెంకీ- వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పి తెలుగులోనూ ప్రచారం చేయడంతో ఈ సినిమా గురించిన థింకింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాకి మీడియా ముఖంగా ప్రచారం సరిగా లేకపోవడంతో రీచ్ తక్కువగా ఉండడం మైనస్ కానుంది.