షారుక్ కొడుకు డ్రగ్ కేసు.. కీలకమైన 5 అప్డేట్స్

Update: 2021-10-04 15:30 GMT
దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారటమే కాదు.. తొలిసారి డ్రగ్స్ వినియోగం ఎంత భారీగా పెరిగిపోయిందన్న కొత్త ఆలోచనలకు ఇటీవల కాలంలో వెలుగు చూసిన రెండు.. మూడు ఉదంతాలు ప్రభుత్వాలకు కొత్త సమస్యగా మారాయని చెప్పాలి. విలాసవంతమైన క్రూయిజ్ లో 1800 మందితో ముంబయి నుంచి గోవాకు వెళ్లే క్రమంలో భారీ రేవ్ పార్టీని ఏర్పాటు చేయటం.. దీనికి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు పలువురు బడా బాబుల పిల్లలు హాజరు కావటం.. ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున ముంబయికి వచ్చి మరీ.. ఈ పార్టీలో హాజరైన తీరు హాట్ టాపిక్ గా మారింది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ కేసుకు సంబంధించిన ఐదు కీలకమైన అప్డేట్స్ లోకి వెళితే..

1.  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులో ఉన్న షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అధికారులు తాజాగా విచారించారు. ఈ సందర్భంగా అతని నోటి నుంచి సంచలన నిజాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా ఆర్యన్ డ్రగ్స్ నను తీసుకుంటున్నానని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. యూకే.. దుబాయ్.. ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా తాను డ్రగ్స్ ను తీసుకునేవాడినని చెప్పాడు.

2.  అధికారుల కస్టడీలో ఉన్న తన కొడుకును షారుక్ కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరు రెండు నిమిషాల పాటు మాట్లాడుకున్నారని. .ఆ సందర్భంగా అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. విచారణ సమయంలో ఆర్యన్ అదే పనిగా ఏడుస్తూనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

3.  అధికారుల అదుపులో ఉన్న ఆర్యన్ ఖాన్ తో ఒకరు సెల్ఫీ తీసుకున్న ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అతను తీక్షణంగా చూస్తున్న వైనం కనిపిస్తుంది. ఫోటో తీసుకున్న వ్యక్తి.. ఎన్ సీబీ అధికారిగా అందరూ అనుకున్నారు. కానీ.. అతను తమ శాఖకు చెందిన అధికారి కాదని స్పష్టం చేశారు. మరి.. అంత పెద్ద సెలబ్రిటీ కుమారుడు విచారణలో ఉన్నప్పుడు.. ఎవరో సంబంధం లేని వ్యక్తి సెల్ఫీ తీసుకునే పరిస్థితి ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.

4. ఆర్యన్ కేసును వాదించే బాధ్యతను ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ సతీష్ మానెషిండేకు అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు. రామ్ జెఠ్మాలానీ వద్ద పని చేసిన ఇతను.. చాలా హై ప్రొఫైల్ కేసుల్ని వాదించినట్లు చెబుతారు. 1993లో సంజయ్ దత్ మీద నమోదైన ఆయుధాల కేసులో వాదించి బెయిల్ ఇప్పించాడు. 2002లో సల్మాన్ పై నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసును వాదించారు. సుశాంత సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియాచక్రవర్తి తరఫున ఆయనే వాదించినట్లుగా చెబుతారు.

5.  డ్రగ్స్  కేసులో చిక్కుకున్న ఆర్యన్ వెంట ఉన్న వారికి సంబంధించి రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి అర్బాజ్ మర్చంట్ అయితే.. రెండోది మూన్ మూన్ ధామేచ. ఇంతకీ ఈ ఇద్దరు ఎవరన్న ఆసక్తి పలువురిలో వ్యక్తమవుతోంది. అర్బాజ్ మర్చంట్ విషయానికి వస్తే.. అతను ఆర్యన్ కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరు తరచూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఆర్యన్ సోదరి సుహానాకు కూడా స్నేహితుడిగా చెబుతారు. ఇక.. మూన్ మూన్ ధామేచ విషయానికి వస్తే.. ఆమెది మధ్యప్రదేశ్ కు చెందిన వ్యాపారుల కుటుంబంగా చెబుతారు. మోడల్ గా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News