శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన 'మేజర్' సినిమా ఈ నెల 3వ తేదీన థియేటర్లకు వచ్చింది. అడివి శేష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా 'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్' జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కింది. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, ప్రమోషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తమకి లభిస్తున్న ప్రశంసలను గురించి చెబుతూనే వస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో శశి కిరణ్ తిక్క మాట్లాడాడు.
" మా సినిమాకి మంచి ఆదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'విక్రమ్'తో పోల్చుకుంటే మాది చాలా చిన్న సినిమా. అయినా ఆ సినిమాతో సమానమైన ఆదరణను పొందుతుండటం విశేషం. ఈ సినిమా షూటింగును చాలా వేగంగా చేశాము. అంత స్పీడ్ లో ఉండగా లాక్ డౌన్ పడింది. అందువలన ఆలస్యమైంది.
లేదంటే క్రితం ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసేవాళ్లం. ఈ సినిమాను చూడగానే సందీప్ ఉన్నికృష్ణన్ గారి తల్లి భావోద్వేగాలతో నన్ను హగ్ చేసుకున్నారు. ఆమె స్పందన చూసిన తరువాత ఈ ప్రాజెక్టు విషయంలో నేను సక్సెస్ అయ్యాను అనుకున్నాను. అలాగే మాపై ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశామనే సంతోషం కలిగింది.
ఇక ఒక నిర్మాతగా మహేశ్ గారు.. నమ్రత గారు ఇద్దరూ కూడా తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక 'మేజర్' సినిమా చూడగానే బన్నీ నాకు కాల్ చేశారు. చాలా బాగా తీశావ్ అంటూ అభినందించారు.
నిజంగా నేను ఊహించలేదు.. ఆయన నుంచి కాల్ వస్తుందని. ఆయన కాల్ చేసి మెచ్చుకోవడం అంటే ఓ 20 కోట్లు ఇవ్వడంతో సమానం. ఈ సినిమాకి ఆయన ఇలా ప్రశంసించడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా వలన నాకు అత్యంత ఆనందాలను కలిగించిన విషయాలలో ఆయన అభినందన కూడా ఒకటి.
ఈ సినిమాలో అడివి శేష్ కేవలం ఒక హీరోగానే చూడలేం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కోసం ఆయన నాతో పాటు సమానంగా కష్టపడ్డాడు. ప్రతి విషయంలోను ఆయన భాగస్వామ్యం ఉంది. తెరపై సందీప్ పాత్ర ఎలా ఉండాలని నేను అనుకున్నానో .. అలాగే ఉండటానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఆడియన్స్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తాను. ఆంగ్లేయుల పాలనా కాలానికి సంబంధించిన ఒక కథను తెరకెక్కించాలని ఉంది. ఆ ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందనేది చూడాలి" అంటూ చెప్పుకొచ్చారు.