ప్రేమలేఖ రాసిన షకీలా.. అలా జరిగిందట

Update: 2019-03-04 09:25 GMT
ఇప్పటి జనరేషన్ ప్రేక్షకుల్లో కొందరికి షకీలా పేరు తెలియదేమో కానీ 90లలో ఆమె పేరు తెలియని సినీ ప్రేమికులు సౌత్ లో ఉండేవారు కాదు.  మలయాళంలో సెమి అడల్ట్ సినిమాలలో నటించి సంచలనం సృష్టించింది షకీలా.  అలాంటి షకీలా జీవితం ఆధారంగా 'షకీలా - నాట్ ఎ పోర్న్ స్టార్' అనే  బయోపిక్ తెరకెక్కుతోంది.  ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా షకీలా రీసెంట్ గా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.

షకీలా ఒక దశలో మలయాళం ప్రొడ్యూసర్ మణ్యంపిల్ల రాజు తో లవ్ లో పడిపోయిందట. 2007 లో షకీలా 'చోటా ముంబయి' అనే మలయాళం సినిమాలో నటించింది.  ఆ సినిమాకు నిర్మాత రాజు. అప్పట్లో షకీలా అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందట. దాంతో డబ్బు అవసరమై మణ్యంపిల్ల రాజును కలిసిందట.  అప్పటికి సినిమా  షూటింగ్ మొదలై జస్ట్ కొన్ని రోజులే అయిందట.  కానీ అదేమీ పట్టించుకోకుండా షకీలా కు మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చేశాడట.  అయన మంచితనం చూసిన షకీలా ప్రేమలో పడిపోయిందట.  ఆయనకు ఒక లవ్ లెటర్ కూడా రాశానని కాకాపోతే ఆయనవైపునుండి ఎలాంటి జవాబు రాలేదని తెలిపింది.  దాంతో ఆయనను మర్చిపోయేందుకు ప్రయత్నించిందట.

ఈ విషయం గురించి వెల్లడిస్తూ.. తన జీవితంలో చాలామంది తనను ప్రేమ పేరుతో మోసం చేశారు కానీ రాజు మాత్రం తాను ప్రేమిస్తున్నానని తెలిసినా ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదని చెప్పుకొచ్చింది.  ఇప్పటి వరకూ షకీలాతో ప్రేమాయణాలు నడిపినవారు.. మోసం చేసినవారు చాలామంది ఉన్నారని తెలుసుకానీ ఇలా ఒక మంచి వ్యక్తి కూడా ఉన్నాడని షకీలా వెల్లడించడం గొప్ప విషయమే.  మరి 'షకీలా.. నాట్ ఎ పోర్న్ స్టార్' లో సంచలనం సృష్టించే ఎపిసోడ్స్ తో పాటుగా ఇలాంటి మంచివ్యక్తుల ప్రస్తావన కూడా ఉందేమో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాలి.
   

Tags:    

Similar News