భారీతనం అంటే శంకర్. అతడి సినిమాల్లో భారీతనానికి .. విజువల్ ఫీస్ట్ అనుభవానికి ఆడియెన్ అడిక్ట్ అవ్వాల్సిందే. అందుకే ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట.. అతడు ఎంత బడ్జెట్ అడిగితే అంతా పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. తనకు కావాల్సిందేంటో స్పష్టంగా తీసుకుని భారీ విజయాల్ని అందుకోవడం అతడికే చెల్లింది. కెరీర్ లో తీసింది తక్కువ సినిమాలే అయినా మరపురాని విజయాలు సొంతం చేసుకున్నారు.
ఆయన కెరీర్ మొదలైంది జెంటిల్ మేన్ సినిమాతో. తొలి సినిమా నుంచి రోబో వరకూ ఆయన తీసిన సినిమాలన్నీ భారీతనం నిండినవే. తాజాగా అతడు తెరకెక్కిస్తున్న 2.ఓ (రోబో2) దాదాప 400కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ - కిలాడీ అక్షయ్ కుమార్ ల వంటి స్టార్లతో మరో విజువల్ వండర్ నే ఆవిష్కరించబోతున్నాడు. నవంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే శంకర్ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి ఆగస్టు 1తో 25 సంవత్సరాలు పూర్తయింది. అతడు తెరకెక్కించిన తొలి సినిమా జెంటిల్ మేన్ రిలీజై పాతికేళ్లయింది. ఇన్నేళ్లలో ఆయన తెరకెక్కించింది కేవలం 12 సినిమాలు మాత్రమే. పాతికేళ్ల జర్నీలో ఆయన ఏనాడూ రాజీకి రాని తత్వ ంతో ఉండడం వల్లనే బండి నడక నెమ్మదిగా సాగింది. జెంటిల్ మేన్ - భారతీయుడు - జీన్స్ - బాయ్స్ - స్నేహితులు వంటి భారీ చిత్రాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రాన్ని దాదాపు 500కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాతికేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సందర్భంగా శంకర్ శిష్యులు మాదేష్ - బాలాజీ శక్తివేల్ - వసంతబాలన్ - అరివళగన్ - అట్లితో పాటు పలువురు కలిసి శంకర్ కు ఓ జ్ఞాపిక అందజేయడమే గాక ప్రత్యేకంగా శంకర్ ని సన్మానించారు. ఈ సందర్భంగా తన శిష్యుల ప్రేమ తనని కదిలించిందని, ఉత్సాహాన్నిచ్చిందని శంకర్ అన్నారు.