'శ్రీకారం' నిర్మాతలకు శర్వా లీగల్ నోటీసులు.. నిజమెంత?
యువ హీరో శర్వానంద్ నటించిన 'శ్రీకారం' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపీ ఆచంట కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా థియేటర్స్ లో ఎక్కువ రోజులు నడవలేదు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూలు చేయకపోవడంతో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ వారికి హీరో శర్వాకు మధ్య రెమ్యూనరేషన్ దగ్గర వివాదం తలెత్తిందని టాక్ వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. 'శ్రీకారం' చిత్రానికి గానూ శర్వా కు రూ.6 కోట్లు ఇచ్చేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. ఇందులో ఇప్పటికే హీరోకి 4 కోట్లు చెల్లించగా.. రిలీజ్ తర్వాత ఇస్తామన్న 2 కోట్ల రెమ్యునరేషన్ ను నిర్మాతలు పెండింగ్ లో పెట్టారట. సినిమా విడుదలై చాలా రోజులవుతున్నా.. నిర్మాతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ వారికి శర్వా లీగల్ నోటీసులు పంపారని వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో శర్వానంద్ ఒకరని చెప్పవచ్చు. తన సినిమా పనుల్లో తప్ప బయట ఎక్కడా పెద్దగా కనబడరు. తన పనేదో తాను చూసుకుంటూ పోయే శర్వా.. బయట వ్యవహారాల్లో కూడా ఎప్పుడూ తలదూర్చలేదు. మరోవైపు 14 రీల్స్ ప్లస్ ప్రొడ్యూసర్స్ కూడా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులు. గతంలో ఎప్పుడూ వీరి మీద ఎలాంటి ఆరోపణలు లేవు. స్టార్ హీరోలతో ఎలాంటి సమస్యలు లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు తీసిన ట్రాక్ రికార్డ్ వారికుంది. అలాంటి నిర్మాతలు - హీరోల మధ్య ఇప్పుడు ఇష్యూ రావడం ఏంటని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ వివాదంలో నిజమెంతో తెలియాలంటే శర్వానంద్ - 14 రీల్స్ నిర్మాతల నుండి క్లారిటీ రావాల్సిందే.