ఆ సినిమా రంగస్థలం పార్ట్2నా?

Update: 2018-06-05 05:28 GMT
కథతో మెప్పించగలిగితే.. జనాలకు టైం బౌండరీలు ఉండవనే విషయం రంగస్థలంతో ప్రూవ్ అయింది. మహానటి ఆ సంగతిని మళ్లీ నిరూపించింది. అందుకే ఇప్పుడు పీరియాడిక్ ఫిలిమ్స్ పై జనాల దృష్టి బాగానే పడింది. ఇకపై ఇలాంటి ప్రాజెక్టులు బాగానే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది కానీ.. ఇప్పటికే కొన్ని సినిమాలు ఇలా పీరియాడిక్ థీమ్ తోనే మొదలుకాబోతున్నాయి.

శర్వానంద్- సాయిపల్లవి జంటగా ప్రస్తుతం పడిపడి లేచె మనసు అనే సినిమా రూపొందుతోంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా.. వీరిద్దరూ మరోసారి జంటగా నటించబోతున్నారు. నీదినాది ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల.. రీసెంట్ గా వీరికి ఓ కథ చెప్పి ఒప్పించాడు. ఈ చిత్రానికి విరాట పర్వం1992 అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. టైటిల్ చూస్తేనే.. ఈ సినిమా కథాకాలం ఏంటో అర్ధమైపోతుంది.

పైగా ఈ చిత్రం కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ తోనే ఉంటుందట. అంటే 1990ల కాలంలో పల్లెటూరి నేపథ్యంతో సాగే చిత్రం అన్న మాట. 1980ల కాలాన్ని రంగస్థలంలో కళ్లకు కట్టినట్లు చూపాడు దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఆ తర్వాతి దశాబ్దంపై దృష్టి పెట్టాడు వేణు ఊడుగుల. అంటే కథా సమయం ప్రకారం అయితే.. రంగస్థలంకు నెక్ట్స్ పార్ట్ అనుకోవచ్చన్నమాట. హీరోయిన్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. అందుకే సాయిపల్లవి ఈ చిత్రంలో చేసేందుకు వెంటనే ఒప్పుకుందని చెబుతున్నారు.
Tags:    

Similar News