పాతతరం నటులు ఎవరిని కదిలించిన ఒకప్పటి స్టార్ హీరో శోభన్ బాబు గురించి గొప్పగా మాట్లాడతారు. క్రమశిక్షణతో కూడిన ఆయన జీవనశైలి.. డబ్బు విషయంలో ఆయన ముందు చూపు.. ఒక వయసు దాటాక సినిమాలకు టాటా చెప్పేసి వ్యక్తిగత జీవితానికే పరిమితమైన ఆయన నియంత్రణ.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి శోభన్ బాబులో. అందుకే ఆ తరం వాళ్లకు ఆయనో స్ఫూర్తి. అయితే శోభన్ బాబు అంటే ఇష్టపడే.. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే నటులు ఈ తరంలోనూ ఉన్నారు. అందులో శర్వానంద్ పేరు ముందు చెప్పుకోవాలి. శోభన్ బాబంటే తనకెంతో ఇష్టమని.. ఆయనలా బతకాలని తాను కోరుకుంటానని శర్వా చెప్పాడు. తాను శోభన్ బాబు గురించి చాలా విన్నానని.. ఆయనపై ఆరాధన భావం పెంచుకున్నానని శర్వా తెలిపాడు.
శోభన్ బాబు జీవన శైలి చాలా బాగుండేదని విన్నానని.. సాయంత్రం ఆరు దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ లో ఉండేవాళ్లు కాదని.. కుటుంబంతో ఎక్కువ గడిపేవారని తెలిసిందని శర్వా చెప్పాడు. 60 ఏళ్లు దాటాక ఇక సినిమాల జోలికి వెళ్లొద్దని గట్టి నిర్ణయం తీసుకున్నారని.. ఎవ్వరు అడిగినా సినిమా ఒప్పుకోలేదని.. అంతటి క్రమశిక్షణ కలిగిన జీవితంలో అందరికీ సాధ్యం కాదని.. అలా ఉండటం తనకు ఇష్టమైనా.. ఆయన్ని ఫాలో అవ్వగలనా అన్నది సందేహమే అని.. అది చాలా కష్టమైన విషయమని శర్వా చెప్పాడు. ఇక పరిశ్రమ అంటే చాలామందికి తప్పుడు అభిప్రాయం ఉందని.. ఇక్కడ పెద్దవాళ్లు చిన్నవాళ్ళను తొక్కేస్తారని అంతా అనుకుంటారని.. అలాంటిదేమీ లేదని.. అలా జరిగి ఉంటే తాను ఇంతదాకా వచ్చేవాడిని కాదని శర్వా చెప్పాడు.