దర్శకేంద్రుడి తనయుడికి శర్వా సపోర్ట్

Update: 2017-03-03 03:56 GMT
దర్శక దిగ్గజం కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడికి ఇప్పటివరకూ కాలం కలిసిరాలేదు. అటు యాక్టర్ గాను.. ఇటు దర్శకుడిగాను చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అనగనగా ఓ ధీరుడు.. సైజ్ జీరో లాంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో బాగా గ్యాప్ తీసుకున్నాడు ప్రకాష్.

ఇప్పుడు మరోసారి తన ప్రయత్నాన్ని ప్రారంభించడమే కాదు.. హిట్ మెషీన్ గా మారిపోయిన శర్వానంద్ ని ఒప్పించేశాడు కూడా. ప్రకాష్ చెప్పిన స్క్రిప్ట్ శర్వాకి విపరీతంగా నచ్చేయడంతో.. అతనితో సినిమాకి సై అనేశాడు. ప్రస్తుతం రాధా అనే మూవీని రెడీ చేస్తున్న శర్వా.. సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నాడు. తాజాగా సంక్రాంతికి విడుదలైన శతమానం భవతి సాధించిన విజయం.. ఈ హీరో రేంజ్ ని మార్చేసిందని చెప్పాలి. ఇప్పుడు మీడియం రేంజ్ లో ప్రామిసింగ్ హీరో అయిన శర్వా.. ప్రకాష్ కోవెలమూడికి సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడని చెప్పాలి.

శతమానం భవతి విషయంలో కూడా దర్శకుడు సతీష్ వేగేశ్న ట్రాక్ రికార్డ్ ని పట్టించుకోలేదు శర్వా. ఇప్పు ప్రకాష్ విషయంలో కూడా ఇదే రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ మూవీని బాహుబలి నిర్మాణ సంస్థ అయిన ఆర్కా మీడియా నిర్మించనుండడం విశేషంగా చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News