శర్వానంద్ సత్తాకు పరీక్షగా నిలుస్తుందనుకున్న సినిమా అసలు విడుదలే కాకుండా ఆగిపోయింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘రాజాధిరాజా’ అనివార్య కారణాలతో విడుదల కాకుండా ఆగిపోయింది. మొన్నటి దాకా ఈ సినిమాకు బుకింగ్స్ కూడా జరిగాయి. కాకపోతే రెండు మూడు థియేటర్లు మాత్రమే ఇచ్చారు. ఐతే శుక్రవారం ఆ థియేటర్లలో కూడా సినిమా రిలీజవ్వలేదు. సినిమాను ఎందుకు ఆపేశారో చెప్పే నాథుడు లేడు. ఈ మధ్య తమిళ డబ్బింగ్ సినిమాలు చాలా వాటికి ఇలాగే జరుగుతోంది. ‘రాజాధిరాజా’ విషయంలో శర్వానంద్ కాస్త చొరవ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడమే ఇష్టం లేదన్నట్లుగా శర్వా ఆ మధ్య మాట్లాడాడు.
రాజాధిరాజా విషయంలో చాలా కథ ఉంది. ఈ చిత్రానికి మొదట అనుకున్న టైటిల్ ‘ఏమిటో ఈ మాయ’. శర్వా, నిత్యామీనన్ జంటగా తమిళ ఫేమస్ డైరెక్టర్ చేరన్ ఈ చిత్రాన్ని తెలుగు - తమిళ భాషల్లో ఆరంభించాడు. ఐతే సినిమా రెండేళ్ల ముందే పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. తమిళం వరకు ఈ చిత్రాన్ని నేరుగా డీవీడీల రూపంలో విడుదల చేసి సంచలనం రేపాడు చేరన్. ఇది జరిగి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పుడు ఎవరో ఓ డిస్ట్రిబ్యూటర్ తెలుగు హక్కులు తీసుకుని.. ‘రాజాధిరాజా’ పేరుతో విడుదలకు సన్నాహాలు చేశాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాతో తనకే సంబంధం లేదు అనేశాడు శర్వా. ప్రమోషన్ కు కూడా ఆసక్తి చూపించలేదు. శర్వానే కాదు.. సినిమాకు పని చేసిన ఇంకెవ్వరూ కూడా దీని గురించి పట్టించుకోలేదు. దీంతో సినిమాకు ఎలాంటి క్రేజ్ లేకపోయింది. ఈ నేపథ్యంలోనే విడుదల ఆగిపోయినట్లు తెలుస్తోంది.