ఇప్పటివరకు ఏ హీరోకైనా మార్కెట్ ను ఎలా చూస్తారో తెలుసా? స్టార్ హీరోలకైతే.. సినిమా ఫ్లాపైనా కూడా ఎంత తీసుకురాగలరు అనే లెక్కను ట్రేడ్ వర్గాలు లెక్కలోకి తీసుకుంటాయి. మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ వంటి హీరోలు.. తమ సినిమాలు అట్టర్ ఫ్లాప్ డిజాష్టర్ అని మొదటి రోజునే ముద్రను వేయించుకున్నా కూడా.. 40 కోట్ల షేర్ ను నిర్మాత చేతిలో పెట్టేస్తారు.
ఇప్పుడు యంగ్ హీరోలైన నాని అండ్ శర్వానంద్ వంటి వారైతే.. వీరి ఫ్లాపులేమో గాని.. వరుసగా ఓ మూడు హిట్లు కొట్టి మూడు భారీ ఫిగర్లు వసూలే చేస్తే.. అసలు వీరి మార్కెట్ కెపాసిటీ ఏంటనేది తెలుస్తుంది. నాని భలే భలే మగాడివోయ్ సినిమాతో 20+ కోట్ల షేర్ తెచ్చే హీరో అనిపించుకున్నాడు కాని.. తిరిగి కృష్ణగాడి వీర ప్రేమగాధతో మాత్రం.. కేవలం 10 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. సో..మార్కెట్ ఇంకా ఫిక్సవ్వలేదు. ఇకపోతే శర్వానంద్ రన్ రాజా రన్ సినిమాతో 10 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎక్స్ ప్రెస్ రాజాకు మాత్రం అంత రాలేదు.
అయితే ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం చేరన్ తీసిన సినిమా ''రాజా ధి రాజా'' (గతంలో ఏమిటో ఈ మాయ అనేది టైటిల్)తో శర్వా వస్తున్నాడు. నిర్మాతలతో ఇష్యూస్ ఉండటంతో.. ఈ సినిమాను హీరో శర్వా కాని.. హీరోయిన్ నిత్యా మీనన్ కాని కనీసం ప్రమోట్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఈ సినిమా ఎంత వసూలు చేస్తుంది అనేదే శర్వానంద్ కు అసలు సిసలైన టెస్ట్ మరి.. కాదంటారా?