శ‌ర్వా `బ్రాండ్ బాబు` అయ్యేవాడా?

Update: 2018-07-30 17:17 GMT
మారుతి క‌థ‌లు ఓ చిన్న అంశం చుట్టూనే తిరుగుతుంటాయి. ఆ అంశం చుట్టూ వినోదాత్మ‌కంగా  స‌న్నివేశాల్ని తీర్చిదిద్ది.. చివ‌ర్లో ఓ మంచి మెసేజ్ ఇచ్చి పంపుతుంటాడు. అది ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంటుంది. ఈరోజుల్లో - బ‌స్‌ స్టాప్‌ లాంటి సినిమాలు అదే త‌ర‌హాలోనే ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాయి. అలాంటి క‌థ‌లు మారుతి ద‌గ్గ‌ర చాలా ఉన్నాయ‌ట‌. వాటిలో కొన్నింటిని సొంతంగా చేస్తాన‌ని... మిగిలిన‌వి వేరే ద‌ర్శ‌కుల‌కు ఇస్తాన‌ని చెబుతున్నాడు. ఆగ‌స్టు 3న వ‌స్తున్న బ్రాండ్ బాబు మారుతి రాసిన క‌థతో తెర‌కెక్కిందే. అయితే ఆ లైన్‌ ని ఇదివ‌ర‌కు శ‌ర్వానంద్‌ కి చెప్పాడ‌ట‌.  కానీ ఆయ‌న భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర‌హాలో ఓ క్యారెక్ట‌ర్ బేస్డ్ హీరో క‌థ‌యితే బాగుంటుంద‌ని చెప్ప‌డంతో - దాన్ని ప‌క్క‌న‌పెట్టి ఓసీడీ ప్రాబ్ల‌మ్ ఉన్న యువ‌కుడి క‌థ‌తో `మ‌హానుభావుడు` తీశాడు. ఆ చిత్రం విజ‌య‌వంత‌మైంది.

అయితే శ‌ర్వా చేయాల్సిన బ్రాండ్ బాబు ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. అయితే మారుతి బ్రాండ్‌ బాబు క‌థ గురించి - మ‌రో కోణాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ``ఇదివ‌ర‌కు ఈ క‌థ మొత్తం శ‌ర్వానంద్‌ కి చెప్ప‌లేదు. లైన్ మాత్ర‌మే చెప్పా. సుమంత్ శైలేంద్ర  కోసం స్ర్కిప్టు చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నాక `బ్రాండ్‌ బాబు` క‌థ మారింది. ఇది సుమంత్ శైలికి త‌గ్గ‌ట్టుగా ఉంటుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంద``ని చెప్పుకొచ్చాడు మారుతి.
Tags:    

Similar News