బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మర్డర్ మిస్టరీ కేసు అనేక మలుపులు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ మాఫియా దగ్గర ఆగింది. బాలీవుడ్ లోని డ్రగ్స్ వ్యవహారాన్ని బయటకు తీస్తోంది. ఇప్పటి వరకు సుశాంత్ కేసుపై సీబీఐ, ఈడీలు విచారణ చేస్తుండగా.. ప్రస్తుతం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్ డీలర్ కైజన్ ఇబ్రహీంను అదుపులోకి తీసుకుంది. అంతేకాకుండా రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ మరియు సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ లను అరెస్ట్ కోర్టులో హాజరపరిచారని తెలుస్తోంది. దీంతో చాలామంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఈ డ్రగ్ దందాలో బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో టీవీ నటుడు శేఖర్ సుమన్ బాలీవుడ్ లో చాలా మంది పెద్ద మనుషుల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
కాగా, డ్రగ్స్ కేసులో అరెస్ట్ ల తర్వాత డ్రగ్స్ మాఫియా లింకుల గురించి శేఖర్ సుమన్ స్పందిస్తూ.. డ్రగ్ మాఫియా బండారం బయటపడిందని.. ఈ వ్యవహారంలో చిన్న చేప దొరికిందని.. అసలు తిమింగాలాలను పట్టుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. 'రియా వెనుకు పెద్ద తలలు ఉన్నాయి. నాకు మొదటి నుంచి సుశాంత్ మృతిపై అనేక అనుమానాలున్నాయి. త్వరలోనే సూత్రదారులు అరెస్ట్ అవుతారు అని శేఖర్ సుమన్ తెలిపారు. వాస్తవాలు బయటకు రావడానికి షోవిక్ అరెస్ట్ తొలి అడుగు. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపే ప్రయత్నంలో ఇది తొలి విజయం. ఈ కేసు నిజాయితీగా సాగితే బాలీవుడ్ లోని మరికొంత మంది ప్రముఖుల పేర్లు బయటకి వస్తాయి అని శేఖర్ సుమన్ పేర్కొన్నారు.