ఎగ్జామ్ రాశా.. రిజల్ట్ కోసం వెయిటింగ్

Update: 2016-11-02 04:26 GMT
కోలీవుడ్ లో హిట్ సాధించిన రెమో చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. నవంబర్ లోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేస్తుండగా.. ఈ మూవీ తెలుగు ఆడియో ఫంక్షన్ ను హైద్రాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. పబ్లిసిటీ విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా.. దాదాపు యూనిట్ మొత్తాన్ని ఫంక్షన్ కు తీసుకురావడంలో దిల్ రాజు సక్సెస్ అయ్యాడు.

టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వచ్చీ రాని తెలుగులోనే స్పీచ్ ప్రారంభించాడు హీరో శివ కార్తికేయన్. 'అందరికీ నమస్కారం. తమిళ్ లో రెమో పెద్ద హిట్ అయింది.. తెలుగులో ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. అందరూ సపోర్ట్ చేయండి. ఆడియో రిలీజ్ కు గెస్ట్ గా వచ్చిన సమంతకు స్పెషల్ థ్యాంక్స్' వరకూ తెలుగులో మాట్లాడినా.. ఆ తర్వాత మాత్రం తమిళ్ లోనే స్పీచ్ కంటిన్యూ చేశాడీ హీరో.

అబ్బాయిని అమ్మాయిగా మర్చేశావ్ అంటూ డైరెక్టర్ బాగ్యరాజ్ కన్నన్ కు  రొంబ రొంబ థ్యాంక్స్ చెప్పిన శివకార్తికేయన్.. హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలో పెద్ద స్టార్ అయిపోతుందని చెప్పాడు. ' తను ఆడియో రిలీజ్ కి వచ్చేందుకు కూడా చాలా కష్టపాడల్సి వచ్చింది. ఇప్పుడంత బిజీ అయిపోయింది. నిజానికి లేడీ గెటప్ లో ఐ లైనర్ లాంటి మైన్యూల్ మేకప్ లాంటివాటివి కీర్తి కారణంగానే తెలుసుకున్నా.. చాలా క్లోజప్ షాట్స్ లో కీర్తి బోలెడు హెల్ప్ చేసింది' అన్న శివ కార్తికేయన్.. సంగీత దర్శకుడు అయిన అనిరుధ్ రవిచందర్ సన్నగా కనిపిస్తాడు కానీ.. సాంగ్స్ మాత్రం అదరగొట్టేస్తాడంటూ ప్రశంసించాడు.

'ఇది ఫన్ ఫిల్డ్ ఎంటర్టెయినర్. డిఫరెంట్ స్టోరీని మాత్రం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయద్దు. ఇది కలర్ ఫుల్ ఎంటర్టెయినర్ మాత్రమే. కీర్తి సురేష్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. నాకు టాలీవుడ్ లో ఇది మొదటి సినిమా. ఎగ్జామ్ రాశాక రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్ లా ఉంది నా పరిస్థితి. తెలుగు ఆడియన్స్ నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ సారి స్ట్రయిట్ ఫిలిం మాదిరిగా ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తాను' అని చెప్పాడు శివకార్తియేయన్.

యాంకర్ సుమ మరిన్ని మాటలు మాట్లాడించేందుకు ప్రయత్నిస్తూ.. 'టీవీ యాంకర్ నుంచి హీరోగా ఎదిగారు.. నేను కూడా ట్రై చేస్తున్నా.. వర్కవుట్ అవుతుందా' అని అడిగినపుడు.. 'నేనే హీరో అయినపుడు.. మీరు హీరోయిన్ కావడం ఈజీనే అంటూ' శివకార్తికేయన్ విసిరిన ఫన్నీ పంచ్ బాగా పేలింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News