లేడీ విలనీ వర్కవుటవుతుందా సార్‌?

Update: 2015-03-18 04:29 GMT
కథానాయికల పాత్రలకు అంతగా ప్రాధాన్యమే ఉండదు. నటనకు అసలు ఆస్కారమే లేదు.. అన్న అపప్రద టాలీవుడ్‌లో ఉంది. అయితే అలాంటి నెగెటివ్‌ టాక్‌ వినిపించే ఇదే పరిశ్రమలో కథానాయికలకు, లేడీ పాత్రలకు కాస్త ఎనర్జీ తెచ్చే దర్శకులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వైవియస్‌ చౌదరి ఒకరు.

ఆయన తన సినిమాల్లో నాయికలకు, మహిళా పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. రొమాన్స్‌, డ్యాన్స్‌, ఎనర్జీ, నెగెటివ్‌ కోణం ఇలా పాయింటు ఏదైనా మహిళా పాత్రలకు ఆ లక్షణాల్ని ఆపాదించి బలమైన పాత్రల్ని సృష్టిస్తాడన్న పేరుంది. అప్పట్లో సీతారామరాజు చిత్రంలో నిర్మలమ్మ పాత్రకు,  లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో లక్ష్మీ పాత్రకు, సీతయ్యలో నళిని పాత్రకు అంతే ప్రత్యేకతను ఆపాదించి ఆయా సినిమాల విజయాలకు ఆయువునిచ్చాడు.

తాజాగా సాయిధరమ్‌ నటించిన రేయ్‌ సినిమాలోనూ శ్రద్ధాదాస్‌కి అదే తరహాలో ఓ నెగెటివ్‌ రోల్‌ని ఇచ్చాడు వైవియస్‌. కథను కీలకమలుపు తిప్పే పాత్ర ఇది. కరేబియన్‌ దీవుల్లో డ్యాన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధాదాస్‌ ఓ నెగెటివ్‌ రోల్‌ పోషించింది. ఈనెలాఖరున రేయ్‌ రిలీజ్‌కి వస్తోంది. అందులో శ్రద్ధా పాత్ర తీరుతెన్నులు చూసి వైవియస్‌లోని గొప్పతనాన్ని ఓమారు స్మరించుకోవాల్సిందే.
Tags:    

Similar News