ఓ హీరో హీరోయిన్లు కలిసి కనిపిస్తే.. ఖచ్చితంగా వాళ్ల మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమంటాయి. అదే ఒకటికి నాలుగు సార్లు కనిపిస్తే, ఇంక వాళ్లకు రిలేషన్ అంటగట్టేస్తారు. ఇప్పుడు దగ్గుబాటి రాణా, శ్రియా శరణ్ లపై అలాంటి వార్తలే వస్తున్నాయి. వీరిద్దరూ రొమాన్స్ లో మునిగి తేలుతున్నారనే న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటోంది శ్రియ.
రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో శ్రియ, రాణా ఇద్దరూ కలిసి కనిపించారు. వీళ్లిద్దరూ చాలాకాలంగా ఫ్రెండ్స్ అనీ, ఎఫైర్ నడుస్తోందనే పుకార్లు బయల్దేరాయి. అయితే దీనిపై శ్రియ ఓ పెద్ద ఎక్స్ ప్లనేషన్ ఇచ్చింది. “ మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన దియా మెహతా భూపాల్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కి కలిసి వెళ్లాం. అదే రోజు దియా పుట్టిన రోజు కూడా. అందుకే తను మమ్మల్ని తీసుకుని లంచ్ కి వెళ్లింది. మాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. రాణా నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్. అంతే అంతకు మించి ఇంకేం లేదు' అని చెప్పింది శ్రియ.
వివరణ బాగానే ఉంది కానీ.. ఈ జంటపై రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఘాజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రాణా. ఇది కంప్లీట్ కాగానే.. బాహుబలి 2 షూటింగ్ లో రాణా భాగం కానున్నాడు.