టాప్ హీరోయిన్స్ అందరూ ఎక్స్ ట్రా బాధ్యతలు మోసేస్తున్నారు. గతంలో అయితే ఇలా వచ్చి అలా యాక్టింగ్ చేసేసి వెళ్లిపోతే సరిపోతుందనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు కాంపిటీషన్ పెరగడంతో.. క్రేజ్ పెంచుకునేందుకు, ప్రమోషన్స్ కోసం కొత్త రూట్ ని కూడా హీరోయిన్స్ ఎంచుకుంటున్నారు. అదే సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కి నయనతార తెర తీసిందని చెప్పాలి.
కృష్ణం వందే జగద్గురుం చిత్రం కోసం తొలిసారిగా సొంతగా డబ్బింగ్ చెప్పింది నయన్. ఆ తర్వాత ఈ ట్రెండ్ ని వరుసగా హీరోయిన్స్ అందరూ ఫాలో అయిపోతున్నారు. సౌత్ సుందరి సమంత,. మిల్కీ బ్యూటీ తమన్నా - కుర్ర భామలు రకుల్ ప్రీత్ సింగ్ - రెజీనాలు కూడా సొంత డబ్బింగ్ ట్రై చేసేస్తున్నారు. ఇప్పటికే తమ వాయిస్ తో డబ్బింగ్ చెప్పిన సమంత - రకుల్ లకు ప్రశంసలు దక్కాయి. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఊపిరి కోసం తమన్నా తొలిసారిగా గొంతు వినిపిస్తుంటే.. ఏప్రిల్ 8న విడుదల కానున్న సర్దార్ గబ్బర్ సింగ్ కోసం కాజల్ అగర్వాల్ స్వరం సవరించుకుంటోంది.
ఇక వీరు కాక టాప్ లీగ్ లో ఉన్నవారిలో అనుష్క - శృతిహాసన్ మాత్రమే డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనుష్క... తెలుగులో చక్కగా మాట్లాడగలదు. కాబట్టి ఈమెకు డబ్బింగ్ అంత కష్టమేం కాదు. ఇప్పటికే తెలుగులో పాటలు పాడిన శృతిహాసన్ కూడా సొంత డబ్బింగ్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద టాప్ హీరోయిన్స్ అందరూ తమ స్వర సౌందర్యాన్ని కూడా మనకు వినిపించేస్తుండడం విశేషం.