నేను ఒకరు ఆదేశిస్తే చేయను..నాకనిపిస్తే చేస్తానంటున్న హీరోయిన్

Update: 2020-04-20 10:50 GMT
కరోనా కారణంగా ప్రపంచ దేశాలతో పాటు మనదేశం కూడా రోజురోజుకి అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు పటిష్టమైన లాక్ డౌన్ అమలుచేసింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఎక్కడి ప్రజలు అక్కడే నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కరోనా పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సినీ సెలబ్రిటీలు సైతం వారికి తోచిన విధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

అయితే హీరోయిన్ శృతిహాసన్ మాత్రం ఇంతవరకు లాక్ డౌన్ లో ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదు. ఈ విషయం పై సోషల్‌ మీడియాలో తనను ట్రోల్‌ చేసిన నెటిజన్స్‌కు దీటైన సమాధానం చెప్తుంది శ్రుతీహాసన్‌. ఇటీవలే శృతి పియానో వాయిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండకపోతే బయటకు వెళ్లి ప్రజలకు సేవ చేయవచ్చుగా’, ‘కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు మీరు ఇంకా ఎందుకు విరాళం ఇవ్వలేదు?’ అని కొందరు నెటిజన్లు కామెంట్లతో ప్రశ్నించారు. ఈ విషయం పై శ్రుతీహాసన్‌ స్పందిస్తూ..

‘‘కరోనా సమయంలో ఎందుకు ప్రజలకు సేవ చేయడం లేదని కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. అసలు నాకు చెప్పేవారు ఎంతగా సేవ చేస్తున్నారో నాకు తెలియదు. కరోనా కారణంగా మనందర్నీ ఇంట్లోనే ఉండమని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే అంత దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు అనే మాటలను నమ్మే వ్యక్తిని నేను. నాకు విరాళం ఇవ్వాలనిపిస్తే తప్పక ఇస్తా.. అంతేకానీ ఎవరో ఆదేశిస్తే నేను చేయను. గతంలో నేను సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి’’ అంటూ ఘాటుగా నెటిజన్లకు జవాబిచ్చింది.



Tags:    

Similar News