అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు ఏటేటా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ర్టం రెండుగా విడిపోయాక జరుగుతున్న మొట్ట మొదటి చలనచిత్రోత్సవాలు ఈనెల 14 నుంచి మొదలవుతున్నాయి. ఎప్పటిలానే హైదరాబాద్ పర్మినెంట్ వెన్యూ ప్లేస్. ప్రపంచ దేశాల నుంచి బాలల చిత్రాలన్నీ ఇక్కడ కమిటీ ముందుకు వచ్చాయి. వాటి నుంచి ది బెస్ట్ మూవీస్ ని ఎంపిక చేసి ఇక్కడ ప్రదర్శించనున్నారు. అవార్డులిచ్చి ఎంకరేజ్ చేయనున్నారు.
అయితే గతంలో ఈ చలనచిత్రోత్సవాల్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. కోట్లకు కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చు చేసి బాగానే చేశారు. ఈసారి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో? ఎలా చేస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రజాధనాన్ని వృథా చేయకూడదు. సేమ్ టైమ్ బాగా చేశారు అనిపించాలి. జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో పేరు రావాలి. ఆ స్థాయిలో మీడియా అటెన్షన్ ఉంటుంది కాబట్టి సరంజామా అంతా జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గానే చేస్తున్నారు. అయితే ఈ వేడుకలకు కలరింగ్ లేకపోతే షో మరీ అంత బావుండదు. కాబట్టి బ్రాండ్ పబ్లిసిటీ కోసం లాంచింగ్ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ని ఆహ్వానించారు. శ్రుతి సైతం పాజిటివ్ గా స్పందించింది. తనతో పాటే మరికొందరు సెలబ్రిటీల్ని 14వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఇన్వయిట్ చేస్తున్నారని సమాచారం. అలాగే ముగింపు ఉత్సవాల్ని సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగానే ప్లాన్ చేస్తున్నారు. అదీ మ్యాటరు.