ప్రభాస్ - అనుష్క పెళ్లి.. పెద్దమ్మ క్లారిటీ ఇచ్చింది

Update: 2022-03-09 02:30 GMT
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి సినిమా తర్వాత వందకు రెండు వందల శాతం పెళ్లి చేసుకుంటాడు అనే ప్రచారం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు కూడా బాహుబలి తర్వాత ఆయన పెళ్లి చేస్తాం అన్నట్లుగా పలు దఫాలుగా ప్రకటించడం కూడా జరిగింది. కాని బాహుబలి విడుదల అయ్యి ఏళ్లు గడుస్తున్నాయి. బాహుబలి తర్వాత సాహో సినిమాను మొదలు పెట్టాడు. సాహో సినిమా తర్వాత అయినా పెళ్లి చేసుకుంటాడేమో అని అంతా భావించారు.

సాహో విడుదల అయ్యి కూడా ఏళ్లు గడుస్తున్నాయి. రాధేశ్యామ్‌ విడుదల తర్వాత పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంటే ఇప్పడు ఏకంగా అరడజను సినిమాలను లైన్ లో పెట్టాడు. కనీసం తినడానికి కూడా సమయం లేనంత బిజీగా ప్రభాస్ మారిపోయాడు. ఇలాంటి సమయంలో ఆయన పెళ్లి ఖచ్చితంగా మరింత లేటు అవుతుందనే టాక్ మొదలు అయ్యింది. ఈ సమయంలో ప్రభాస్ మరియు అనుష్కల ప్రేమ వ్యవహారం మరియు పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది.

బాహుబలి కి ముందు నుండే వీరిద్దరి ప్రేమ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. పలు సందర్బాల్లో ఇద్దరు ప్రేమ నిజమేనేమో అన్నట్లుగా ప్రవర్తించారు. కాని వారు ఇద్దరు కూడా తామిద్దరం మంచి స్నేహితులం అంటూ ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి వారిద్దరి ప్రేమ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు కనుకే ఇద్దరు కూడా పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నారు.

ఏదో ఒక రోజు బాంబు పేల్చి నట్లుగా తమ ప్రేమ వ్యవహారం ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో ప్రభాస్ పెద్దనాన్న అయిన కృష్ణం రాజు భార్య శ్యామల దేవి గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ హీరోయిన్‌ అనుష్క తో ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేయడం జరిగింది. అంతే కాకుండా ఆమె ప్రభాస్‌ పెళ్లి పై మరింత స్పష్టతను ఇచ్చారు. ప్రభాస్‌ కు మన సంస్కృతి మరియు సాంప్రదాయాలు అంటే చాలా గౌరవం. అందుకే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చారు.

శ్యామల దేవి గారు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అంటూ అంత నమ్మకంగా చెప్పడంతో అభిమానులు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు. సల్మాన్‌ ఖాన్ మాదిరిగా ప్రభాస్ కూడా ఒంటరిగా జీవితాన్ని గడిపేందుకు సిద్ధం అయ్యాడా ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం ప్రభాస్‌ పెళ్లి చేసుకోకుంటే ఇంత స్టార్ డమ్‌ ఉండి ఏం లాభం అంటూ పెదవి విరుస్తున్నారు. శ్యామల గారి మాటలతో ప్రభాస్ ఇప్పుడు కాకున్నా ఇంకో రెండు మూడు ఏళ్లకు అయినా పెళ్లి చేసుకుంటాడని క్లారిటీ వచ్చినట్లయ్యింది.
Tags:    

Similar News