ఫైనల్ గా లవర్ బాయ్ సిద్దు హిట్టు కొట్టేశాడు. గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతోన్న సిద్దార్ద్ గృహం అనే సినిమాను తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తమిళ్ లో (అవళ్) నవంబర్ 3న రిలీజ్ అయ్యింది కానీ తెలుగు - హిందీ లో మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఇంకా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోకపోవడమే అసలు కారణమని తెలుస్తోంది.
ఈ మధ్యనే సిద్దు గృహం సినిమా కోసం టాలీవుడ్ లో భారీగా ప్రమోషన్స్ కూడా చేశాడు. అయితే ఈ సినిమాకు కోలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. పూర్తిగా హర్రర్ నేపథ్యంలో ఉండడంతో మంచి థ్రిల్ కి ఫీల్ అవుతున్నారట. ఇక కొన్ని సెంటర్స్ లో ప్రేక్షకుల కోరిక మేరకు థియేటర్స్ ని పెంచినట్లు తెలుస్తోంది. మొత్తానికి సిద్దార్థ్ సరికొత్తగా హిట్ అందుకున్నాడని కోలీవుడ్ జనాలు చెబుతున్నారు. కాని ఈ సినిమా ఈ శుక్రవారం కూడా రిలీజ్అవ్వదేమో అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అయితే ఎప్పుడు రిలీజైనా కూడా సినిమా మాత్రం హిట్టవుతుంది అంటున్నాడు సిద్దూ.
ఈ హారర్ సినిమాలో కామెడీ ఇతర అనవసర సన్నివేశాలు ఏమి లేవు. ఒక ఫుల్ హారర్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా నచ్చుతుందని సిద్దార్థ్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా హిట్ తో తప్పకుండా మళ్లీ తెలుగు సినిమాలను కూడా చేస్తానని చెబుతున్నాడు. మిలింద్ రావ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆండ్రియా జెరీమియా హీరోయిన్ గా నటించింది.