ఈ శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ కావాల్సింది. కానీ మూడే విడుదలవుతున్నాయి. సిద్దార్థ్ డబ్బింగ్ సినిమా ‘గృహం’ అనుకోకుండా ఆగిపోయింది. నవంబరు 3న తమిళం.. హిందీ.. తెలుగు భాషల్లో ఒకేసారి తన సినిమాను రిలీజ్ చేయాలన్న సిద్ధు ప్రయత్నాలు ఫలించలేదు. కనీసం ఈ సినిమా విడుదల ఆగిపోతున్నట్లు ప్రకటన కూడా చేసే తీరిక లేకపోయింది సిద్ధుకు.
ఐతే ఈ చిత్రం విడుదల ఆగిపోవడంలో సిద్ధు ప్రమేయం ఏమీ లేదు. ఆ సినిమాకు థియేటర్లు దక్కకపోవడం వల్లే రిలీజ్ ఆగినట్లు సమాచారం. దీపావళికి విడుదలైన ‘రాజా ది గ్రేట్’ సినిమా కోసం అట్టిపెట్టుకున్న థియేటర్లను దిల్ రాజు మూడో వారంలో కూడా వదలట్లేదు. గత వారం వచ్చిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ కూడా ఓ మోస్తరు సంఖ్యలో థియేటర్లు ఆపుకుంది. ఇక ఈ వారం చూస్తే ఒకటికి మూడు సినిమాలు రిలీజవుతున్నాయి.
వాటిలో ‘గరుడవేగ’.. ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాలకు బ్యాకప్ బాగానే ఉంది. వాటికి థియేటర్లు బాగానే ఇచ్చారు. మిగిలిన థియేటర్లను ‘ఏంజెల్’ తీసుకుంది. దీంతో సిద్ధు సినిమాకు థియేటర్లే మిగల్లేదు. సిద్ధుకు తమిళ మార్కెట్టే కీలకం. హిందీలో కూడా విడుదల కోసం సన్నాహాలు చేసుకోవాల్సి ఉంది. దీంతో హైదరాబాద్ వచ్చి థియేటర్ల కోసం లాబీయింగ్ చేసే టైం అతడికి లేకపోయింది. దీంతో ‘గృహం’ విడుదల ఆగిపోయింది. ఖాళీ ఉన్న టైం చూసి తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు సిద్ధు. నవంబరు నెలాఖర్లో కానీ అతడికి అవకాశం దక్కకపోవచ్చు.