అనాధ బాలల జీవితాలు ఎలాంటి అంధకారంలో ఉంటాయో స్లమ్‌డాగ్ మిలియనీర్ చూసి తెలుసుకున్నాం. ముంబై లాంటి మహా నగరంలో అనాధ పిల్లలతో ఎలాంటి వ్యాపారాలు చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపించాడు డానీ బోయ్‌లే. అందుకే ఆస్కార్ అందుకుంది ఈ సినిమా.
అయితే సరిగ్గా ఆ సినిమా నుంచి ఇన్‌స్పయిర్ అయ్యాడో ఏమో ఎల్బీడబ్ల్యూ ఫేం ప్రవీణ్ సత్తారు తాజాగా రూపొందిస్తున్న ఓ సినిమాలో స్లమ్‌డాగ్ క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేశాడు. స్లమ్‌లో మురికి కూపంలో అల్లాడిపోయే కుర్రాడిగా నటిస్తున్నాడు సిద్ధూ. ఎల్‌బిడబ్ల్యూ తర్వాత మరోసారి అదే దర్శకుడు రూపొందిస్తున్న గుంటూర్ టాకీస్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఎప్పుడూ రొటీన్ క్యారెక్టర్లు ఎంపిక చేసుకోవడం నా వల్ల కాదు. స్టీరియో టైపిక్‌గా ఉండకూడదు. అందుకే ఇలా నవ్యపంథా క్యారెక్టర్లను ఎంచుకుంటున్నా అని చెప్పాడు. సెలక్టివ్‌గా ఎంపికలు ఉంటేనే మనకంటూ ఏదైనా ప్రత్యేకత వస్తుందని ఆశిస్తున్నాని అన్నాడు. ప్రయోగాలు ఒంటికి మంచిదే. ఆల్ ది బెస్ట్ సిద్ధూ.