సింగర్ సునీత భర్త వీరపనేని రామ్ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి నుండి పదే పదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని... బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామ్ పేర్కొన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి తాను సినీ నిర్మాతల కౌన్సిల్ సభ్యుడిని.. వ్యక్తిగతంగా కలవాలి అంటూ కొన్ని రోజుల క్రితం వీరపనేని రామ్ కు కాల్ చేశాడు.
పదే పదే కాల్ చేస్తూ ఉండటంతో రామ్ అతడి నెంబర్ ను బ్లాక్ చేయడం జరిగింది. దాంతో వేరు వేరు నెంబర్స్ నుండి అతడు కాల్స్ చేయడం మెసేజ్ లు చేయడం చేస్తున్నాడట.
మొదట ఏదైనా బిజినెస్ విషయమై కలవాలని అనుకుంటున్నాడేమో అని తన టీమ్ తో మాట్లాడాలని చెప్పాడట. కానీ అతడు మాత్రం వ్యక్తిగతంగా తనతోనే మాట్లాడాలని పట్టుబడుతున్నాడు అంటూ రామ్ పేర్కొన్నాడు.
కాల్స్ కు మరియు మెసేజ్ కు రెస్పాన్స్ అవ్వక పోవడంతో బెదిరించడం మొదలు పెట్టాడు.
లక్ష్మణ్ నుండి తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందని.. ప్రాణ హాని ఉందంటూ రామ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఇంతకు ఆ లక్ష్మణ్ ఎవరు అంటూ ఇప్పుడు అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.