ఐ మిస్ యూ తాత.. సీతార బ్రోకెన్ హార్ట్‌ పోస్ట్‌ వైరల్‌

Update: 2022-11-16 09:31 GMT
సూపర్ స్టార్‌ కృష్ణ మృతి తో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో పాటు ఆయన సోదరిమణులు ఈ స్థాయిలో ఉన్నారు అంటే కచ్చితంగా అది సూపర్‌ స్టార్‌ కృష్ణ యొక్క కష్టంకు ప్రతిఫలం అనడంలో సందేహం లేదు.

కృష్ణ ఎంతో కష్టపడి ఎదిగి తన కుటుంబం ను ఈ స్థాయిలో నిలబెట్టాడు. అందుకే ఫ్యామిలీలోని అందరికి కూడా కృష్ణ అంటే ప్రత్యేకమైన గౌరవం అభిమానం.

సితార కు కూడా తాత కృష్ణ అంటే అమితమైన అభిమానం. ఎన్నో సందర్భాల్లో తాత కృష్ణ తో తీసుకున్న పోటోలను షేర్‌ చేస్తూ ఉండేది. తాత తో ఎన్నో ముచ్చట్లు పంచుకున్నట్లుగా సోషల్‌ మీడియాలో పలు సార్లు ఫోటోలు షేర్ చేసిన విషయం తెల్సిందే. ఈసారి సితార షేర్ చేసిన పోస్ట్‌ వైరల్‌ అయ్యింది.

ఐ మిస్ యూ తాత అంటూ సితార బ్రోకెన్ హార్ట్‌ ఈమోజీని షేర్‌ చేసింది. సీతూ పాప షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఇక నుండి నేను మీతో భోజనం చేయడం మిస్‌ అవుతాను. మీరు నాకు చాలా విషయాలను నేర్పించారు. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలని మీరు సూచించిన విషయాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.

మీ యొక్క జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా నాతో ఉంటాయి. ఏదో ఒక రోజు మీరు గర్వించే విధంగా నేను ఉన్నత స్థాయికి వెళ్తాను అంటూ తాత మృతి నేపథ్యంలో సీతూ పాప ఇన్ స్టా లో తాతతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్‌ అయ్యింది. సితార యొక్క పోస్ట్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ యొక్క అభిమానులకు కన్నీరు పెట్టిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News