టాలీవుడ్ లో చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీని అవాయిడ్ చేస్తుంటాయి. నిర్మాతలు, దర్శకులు కూడా మరో సినిమాతో పోటీకి దిగడానికి ఇష్టపడరు. ఈ పోటీ కారణంగా ఎవరు ఒకరు నష్టపోయే అవకాశం వుంటుంది కాబట్టి అంతగా అవాయిడ్ చేసినా కొన్ని సార్లు పోటీ అనివార్యం అవుతూ వుంటుంది. ఇప్పడు ఇదే తరహా పోటీ రెండు సినిమాల మధ్య ఏర్పడింది. అయితే ఇవి డిఫరెంట్ మూవీస్ కావడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. ఈ శుక్రవారం విడుదలైన మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. దీంతో అందరి దృష్టి ఇప్పడు ఆగస్టు 5న విడుదల కానున్న సినిమాలపై పడింది. ఆగస్టు 5న నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' విడుదల కానుంది. 5వ శతాబ్దంలోని మగధ రాజ్యానికి చెందిన త్రిగర్తలాధినేత బింబిసారుడి కథకు ఫాంటసీ అంశాలని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు.
నందమూకి కల్యాణ్ రామ్ తన కెరీర్ కి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. త్రిగర్తలాధినేత బింబిసారుడికి నేటి కాలానికి వున్న సంబంధం ఏంటీ? .. ఇంతకీ బింబిసారుడు ఇక్కడ ఎలా ప్రతక్షమయ్యాడు అనే ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ మూవీని మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లు మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.
ఇక ఇదే మూవీతో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన 'సీతారామం'. హను రాఘవపూడి తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా రూపొందిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లతో మంచి బజ్ ని సొంతం చేసుకుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో సుమంత్, తరుణ్ భాస్కర్, గైతమ్ మీనన్ నటించారు.
ఇప్పటికే విడుదలైన పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. దీంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. సీతారామం, బింబిసార రెండే పీరియాడిక్ నేపథ్యంలో సాగే ఫిక్షనల్ మూవీసే అయినా రెండు సినిమాల మధ్య చాలా వ్యత్యాసం వుంది.
బింబిసార సీరియస్ గా సాగే ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా. 'సీతారామం' ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. విబిన్నమైన కథలతో తెరకెక్కిన ఈ రెండు సినిమామీదే అందరి దృష్టి నెలకొని వుంది. వచ్చే వారం థియేటర్లలో సందడి చేయనున్న ఈ టూ మూవీస్ ఏ మేరకు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయనున్నాయో...బాక్సాఫీస్ ఫైట్ లో ఏ సినిమా పైచేయి సాధించనుందో తెలియాలంటే ఆగస్టు 5 వరకు వేచి చూడాల్సిందే.