బాక్సాఫీస్ ని పిండేస్తున్న చిన్న సినిమాలు

Update: 2015-11-24 17:30 GMT
బాహుబలి - శ్రీమంతుడు ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. వీటి తర్వాత టాలీవుడ్ లో కలెక్షన్ సెంటిమెంట్ బాగానే ఊపందుకుంది. కొన్ని భారీ చిత్రాలు హై ఎక్స్ పెక్టేషన్స్ తో దెబ్బతిన్నా.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయేలా వచ్చాయి. అయితే చిన్న సినిమాలు ఊహించని స్థాయిలో లాభాల పంట పండిచేస్తున్నాయి.

లేటెస్ట్ రిలీజ్ కుమారి 21 ఎఫ్ కలెక్షన్స్ కుమ్మేస్తోంది. పది కోట్ల షేర్ వసూళ్లలో ఎంట్రీకి సిద్ధంగా ఉందీ సుకుమార్ సినిమా. దీనికి ముందు కూడా కొన్ని లో - మీడియం బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. ముఖ్యంగా వీటిల చెప్పుకోవాల్సింది భలేభలే మగాడివోయ్ గురించే. ఇది పాతిక కోట్ల షేర్ వసూళ్లతో.. చిన్న సినిమాలకు బాహుబలి అనిపించుకోవడమే కాదు.. కలెక్షన్స్ విషయంలో ఓ బెంచ్ మార్క్ కూడా సెట్ చేసింది. రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్త మావా - సాయి ధరం తేజ్ మూవీ సుబ్రమణ్యం ఫర్ సేల్ - వరుణ్ తేజ్ కంచె - ఓంకార్ తీసిన రాజు గారి గది చిత్రాలకు కూడా అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి.

వీటిలో కొన్నింటికి నిర్మాత పెట్టుబడికి రెట్టింపు, మూడింతలు కూడా సంపాదించిపెట్టడం విశేషం. ఓవరాల్ గా చూస్తే టాలీవుడ్ లో మాత్రం కలెక్షన్స్ సెంటిమెంట్ బాగుంది. ఈ వారంలో కూడా రెండు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అనుష్క నటించిన సైజ్ జీరో మీడియం బడ్జెట్ మూవీ కాగా.. తను నేను అనే లో బడ్జెట్ చిత్రంపైనా అంచనాలున్నాయి. ఇవి కూడా కలెక్షన్లు కుమ్మేస్తే.. టాలీవుడ్ లో సెంటిమెంట్  మరింత స్ట్రాంగ్ అవడం ఖాయం..
Tags:    

Similar News