సెలబ్రేషన్ అన్న పదానికి అసలైన నిర్వచనం అంటే కరీబియన్ కుర్రాళ్లే ఇస్తారు. సక్సెస్ నైనా - మరొకదాన్నైనా ఎంజాయ్ చేయాలంటే వాళ్ల పేరే చెప్పాలి. విండీస్ క్రికెటర్లని చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. వాళ్లకి మైదానంలో ఒక్క విజయం లభించిందంటే చాలు.. రెచ్చిపోతారు. గ్రౌండ్ లోనే ఓ చిన్న పాటి పార్టీని చేసుకుంటారు. ఇక బయటకొస్తే ఆ సందడి మరింత రెట్టింపవుతుంది. ఆ ఊపులో - హుషారు ప్రత్యేకంగా ఉంటుంది. ఇటీవల విండీస్ ఐసీసీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఓ భారీ విజయాన్ని చేజిక్కించుకుంది. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయడం కోసం ఓ పార్టీకి హాజరయ్యారు కొద్దిమంది ఆటగాళ్లు. అందులో సిక్సర్ల గేల్ తోపాటు - బ్రావో కూడా ఉన్నాడు. ఆ పార్టీలోకి మన స్నేహా ఉల్లాల్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది.
అసలే నీలికళ్లపాప. ముట్టుకుంటే మాసిపోయేంత కలరుంది. అలాంటి అందగత్తె మధ్యలోకొస్తే ఇక విండీస్ క్రికెటర్లు వదిలిపెడతారా? ఆమెతో పోటీ పడి మరీ డ్యాన్సులేశారు. సరదాగా మాటల్లోకి దించి ముచ్చట్లు చెప్పారు. అంతటితో ఆగకుండా బ్రావో - గేల్ సెల్పీలు కూడా దిగారు. బ్రావో సెల్ఫీనే కాకుండా ఇద్దరూ దగ్గర దగ్గరగా నిలుచుని, ఒకరినొకరు హత్తుకొని మరీ ఫొటోలు దిగారు. ఆ వీడియోని స్నేహా వుల్లాల్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇటీవల కెరీర్ పరంగా ఆమెకి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇప్పుడు విండీస్ క్రికెటర్లతో కలిసి చేసుకున్న పార్టీతో మరోసారి ఆమె వెలుగులోకి వచ్చినట్టైంది.