సోగ్గాడు హాఫ్ సెంచరీ దాటేశాడు

Update: 2016-02-13 03:46 GMT
ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్ లలో బిగ్గెస్ట్ హిట్ ఏది అంటే.. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అనుకోవచ్చు. కానీ ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఈ ఏడాదికి సంక్రాంతి కింగ్ నాగార్జునదే. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న నాగ్ సోగ్గాడే చిన్ని నాయన.. ఇప్పుడో క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో అతి తక్కువ మందికే సాధ్యమైన ఓ ఫీట్ ని.. సింపుల్ గా దాటేశాడు నాగార్జున.

50 కోట్ల కలెక్షన్స్.. ఇప్పటివరకూ పవన్ - మహేష్ - చరణ్ - బన్నీలకే ఈ రికార్డ్ ఉంది. గతేడాది ప్రభాస్ కూడా ఫిఫ్టీ క్రోర్స్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ ని తొలిసారిగా జూనియర్ ని 50 కోట్ల హీరో చేసింది. కానీ అనూహ్యంగా.. ఈ రేర్ ఫీట్ ను నాగార్జు అందుకున్నాడు. రిలీజ్ అయిన నాలుగు వారాల్లో 50 కోట్ల ''షేర్‌'' కలెక్షన్స్ ను సాధించాడు  సోగ్గాడు. ఇంతమంది సాధించాక.. నాగ్ ఆ రికార్డు కొట్టడం పెద్ద విశేషమా అనుకోవచ్చు. కానీ ఇప్పటివరకూ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ లే.

నాగార్జున మాత్రం కేవలం 15కోట్లతోనే సోగ్గాడే చిన్ని నాయన చిత్రాన్ని తీశాడు. నాన్నకు ప్రేమతో చిత్రాన్ని థియేటర్లలోకి తెచ్చేందుకు 54కోట్లు ఖర్చైంది. దానికి వచ్చిన మొత్తం కూడా అంతే. కానీ నాగ్ మాత్రం 15 కోట్లతో సినిమా తీసి, ఫుల్లు కాంపిటీషన్ లోనే ధైర్యంగా రిలీజ్ చేసి.. యాభై మార్క్ ను అందుకున్నాడు. అందుకే ఈ సంక్రాంతికి కింగ్ నాగార్జునే.
Tags:    

Similar News