సోగ్గాడా.. అదరగొట్టేశావ్ పో!

Update: 2016-01-22 10:46 GMT
బహుశా నాగార్జునకు సైతం ఈ కలెక్షన్లు నమ్మశక్యంగా ఉండవేమో. వారం రోజుల్లోనే రూ.23.34 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రావడమన్నది నాగార్జున కెరీర్లోనే ఎన్నడూ జరగలేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ వసూళ్ల ప్రభంజనానికి నిదర్శనమిది. సంక్రాంతికి మరో మూడు క్రేజున్న సినిమాలతో పోటీ పడి.. నాగ్ మూవీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడమంటే మామూలు విషయం కాదు. నాగ్ చివరి సినిమా ‘మనం’కు చాలా మంచి రివ్యూలు వచ్చాయి. అందరూ ఆ సినిమాను అద్భుతం అన్నారు. పైగా పోటీ కూడా లేదు. అందులోనూ వేసవి సెలవుల్లో ఆ సినిమా రిలీజైంది. అయినా ‘మనం’ ఫుల్ రన్లో రూ.30 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ‘సోగ్గాడే’ వారంలోనే ఎంతో పోటీ మధ్య రూ.23.34 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది.

నైజాం ఏరియాలో కేవలం 120 థియేటర్లలోనే రిలీజైనప్పటికీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ రూ.5.66 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. రాయలసీమలో రూ.3.41 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.2.36 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.1.12 కోట్లు, కృష్ణాలో రూ.1.45 కోట్లు, గుంటూరులో రూ.2.01 కోట్లు, వైజాగ్ లో రూ.1.45 కోట్లు, నెల్లూరులో రూ.98 లక్షల ఫస్ట్ వీక్ షేర్ వచ్చింది. ఏపీ, తెలంగాణ కలిపి రూ.18.44 కోట్లు వసూలయ్యాయి. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.1.8 కోట్లు రాగా... ఓవర్సీస్ లోనూ రూ.3.1 కోట్లు కలెక్ట్ చేసింది నాగ్ మూవీ. ఇప్పటికే బయ్యర్లందరూ లాభాల్లోకి వచ్చేశారు. పరిమిత బడ్జెట్లో సినిమా తీసిన నాగార్జున.. పెట్టుబడి మీద రెండు మూడు రెట్లు సంపాదించేలా ఉన్నాడు.
Tags:    

Similar News